ప్రపంచకప్‌లో సత్తా చాటి పునర్వైభవం సాధించాలని పాకిస్తాన్ క్రికెట్ జట్టు గట్టి పట్టుదలగా ఉంది. ఇందుకోసం ఎంతటి కఠిన నిర్ణయమైనా తీసుకునేందుకు ఆ దేశం క్రికెట్ బోర్డు సై అంటోంది.

ఇందులో భాగంగానే ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో పేలవంగా ఆడిన ముగ్గురు ఆటగాళ్లను ప్రపంచకప్‌ జట్టు నుంచి తప్పించి వీరి స్థానంలో ముగ్గురికి అవకాశం కల్పించింది.

పాక్ చీఫ్ సెలక్టర్ ఇంజమామ్ ఉల్ హక్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో తమ ఆటగాళ్లు స్థాయికి తగ్గ మేర రాణించలేకపోయారని.. అందుకే జట్టు కూర్పుపై మరోసారి కసరత్తు చేసినట్లు ఇంజమామ్ చెప్పారు.

ఇందులో భాగంగానే అబిద్ అలీ, ఫహీమ్ అష్రఫ్, జునైద్ ఖాన్‌లపై వేటు వేసినట్లు తెలిపారు. వీరి స్ధానంలో అమీర్, వాహబ్ రియాజ్, అసిఫ్ అలీలకు ప్రపంచకప్‌లో చోటు దక్కింది. మే 23 వరకు ఆయా జట్లు తమ ఆటగాళ్లను మార్చుకునేందుకు ఐసీసీ అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే.

పాక్ ప్రపంచకప్ జట్టు:

సర్ఫరాజ్ అహ్మద్ (కెప్టెన్)
ఫకార్ జమాన్
ఇమామ్ ఉల్ హక్
బాబర్ అజమ్
హ్యారిస్ సోహైల్
అసీఫ్ అలీ
షోయాబ్ మాలిక్
మహ్మద్ హఫీజ్
ఇమాద్ వసీం
షాదాబ్ ఖాన్
హసన్ అలీ
షాహిన్ అఫ్రిదీ
మహ్మద్ అమిర్
వాహబ్ రియాజ్
మహ్మద్ హస్‌నైన్