Pakistan vs Sri Lanka: అబుదాబిలో జరిగిన ఆసియా కప్ 2025 సూపర్ ఫోర్ మ్యాచ్‌లో పాకిస్తాన్ కు శ్రీలంక చెమటలు పట్టించింది. అయితే, చివరకు ఎలాగోలా పాకిస్తాన్ శ్రీలంక పై విజయం సాధించింది.

Pakistan vs Sri Lanka: అబుదాబిలో జరిగిన ఆసియా కప్ 2025 సూపర్ ఫోర్ మ్యాచ్‌లో శ్రీలంకపై పాకిస్తాన్ విజయం సాధించింది. అయితే, 134 పరుగుల టార్గెట్ ను అందుకునే క్రమంలో పాక్ కు చెమటలు పట్టించింది. చిన్న టార్గెట్ కోసం పాక్ జట్టు 18 ఓవర్లు తీసుకుంది.

ఈ మ్యాచ్ లో శ్రీలంక జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. మొత్తం 20 ఓవర్లలో 133/8 పరుగులు చేసింది. పవర్‌ప్లేలోనే పాకిస్తాన్ పేస్ బౌలర్లు శ్రీలంక టాప్ ఆర్డర్‌ను దెబ్బతీశారు. షాహీన్ అఫ్రిది కొత్త బంతుతో మూడు వికెట్లు తీశాడు. ఆరో ఓవర్‌లో హారిస్ రౌఫ్ మరో కీలక వికెట్‌ను పడగొట్టాడు.

కమిందూ మెండిస్ హాఫ్ సెంచరీతో పోరాడాడు. జట్టు 58/5 వద్ద కష్టాల్లో ఉండగా, అతని ఇన్నింగ్స్ వల్ల శ్రీలంక పోటీ స్కోర్‌కి చేరుకుంది.

అఫ్రిది, తలత్ బౌలింగ్ ప్రభావం

షాహీన్ అఫ్రిది పవర్‌ప్లేలో మూడు వికెట్లు తీసి శ్రీలంకను కష్టాల్లోకి నెట్టాడు. అతని స్పెల్ మ్యాచ్‌కు టోన్ సెట్ చేసింది. హుస్సేన్ తలత్ ఒకే ఓవర్‌లో అసలంక, దసున్ శనకాను ఔట్ చేసి మిడిల్ ఆర్డర్ ను దెబ్బతీశాడు. 62/5 వద్ద శ్రీలంక మరింత ఒత్తిడికి లోనైంది. ఈ బౌలింగ్ ప్రదర్శన వల్ల శ్రీలంక స్కోరు 140 లోపే ఆగిపోయింది.

134 పరుగుల లక్ష్యంతో పాకిస్తాన్ చేజ్ మొదలుపెట్టింది. మొదటి వికెట్ కు 45 పరుగులు చేసింది. కానీ 17 బంతుల్లో 45/0 నుంచి 57/4కి పడిపోయింది. తీక్షణ రెండు వికెట్లు తీశాడు. హసరంగ రెండు వికెట్లు తీసి, ఒక అద్భుతమైన క్యాచ్ పట్టాడు. ఈ మినీ-కోలాప్స్ తర్వాత పాకిస్తాన్ ఒత్తిడికి గురైంది. కానీ హుస్సేన్ తలత్, మహ్మద్ నవాజ్ భాగస్వామ్యం జట్టును మళ్లీ గేమ్‌లోకి తెచ్చింది.

తలత్–నవాజ్ భాగస్వామ్యం

తలత్, నవాజ్ కలిసి జాగ్రత్తగా ఆడుతూ స్కోరింగ్ రేట్‌ను కంట్రోల్‌లో ఉంచారు. హసరంగ బౌలింగ్‌ను ఎదుర్కొంటూ నెమ్మదిగా స్కోరు పెంచారు. చివరికి 18 ఓవర్లలో 138/5కి చేరి పాకిస్తాన్ విజయాన్ని సాధించింది.

Scroll to load tweet…

పాకిస్తాన్ vs శ్రీలంక మ్యాచ్‌లో కీలక మలుపులు

• పవర్‌ప్లేలో మూడు వికెట్లు కోల్పోయిన శ్రీలంక 53/3తో కష్టాల్లో పడింది.

• హుస్సేన్ తలత్ ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసి, శ్రీలంకను దెబ్బకొట్టాడు.

• పాకిస్తాన్ 57/4కి పడిపోవడంతో ఉత్కంఠ పెరిగింది. కానీ తలత్–నవాజ్ భాగస్వామ్యం పాక్ ను విజయం పైపు తీసుకెళ్లింది.

• శ్రీలంక: 133/8 (20 ఓవర్లు) – కమిందూ మెండిస్ (50 పరుగులు) టాప్ స్కోరర్, అఫ్రిది మూడు వికెట్లు, రౌఫ్ ఒక వికెట్ తీసుకున్నారు.

• పాకిస్తాన్: 138/5 (18.5 ఓవర్లు) – తలత్, నవాజ్ భాగస్వామ్యం జట్టును 5 వికెట్ల తేడాతో గెలిపించింది.