ఈ మ్యాచ్ లో విజయం ఎవరు సాధిస్తారు అనే విషయంలో బెట్టింగులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. ఎక్కువ శాతం విజయం భారత్ నే వరిస్తుంది.. అయినప్పటికీ.. పాక్ క్రికెటర్లూ అంత ఈజీగా వదలరు. వీలైనంత వరకు గట్టిపోటీనే ఇస్తూ ఉంటారు.
క్రికెట్ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే మ్యాచుల్లో ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ మొదటి వరసలో ఉంటుంది. ఈ రెందు దాయాది దేశాల మధ్య మ్యాచ్ అంటే... క్రికెట్ చూడనివరైనా చూసేస్తారేమో. ఈ మ్యాచ్ లో విజయం ఎవరు సాధిస్తారు అనే విషయంలో బెట్టింగులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. ఎక్కువ శాతం విజయం భారత్ నే వరిస్తుంది.. అయినప్పటికీ.. పాక్ క్రికెటర్లూ అంత ఈజీగా వదలరు. వీలైనంత వరకు గట్టిపోటీనే ఇస్తూ ఉంటారు.
కాగా... యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్-2022లో భాగంగా పాకిస్తాన్ నిర్దేశించిన 148 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ 19.4 ఓవర్లలో విజయాన్ని అందుకుంది. దీంతో.. భారత్ అభిమానులంతా పండగ చేసుకుంటారు. ఈ సంగతి పక్కన పెడితే... ప్రత్యర్థి జట్టుకు చెందినవాడైనా సరే... పాకిస్తాన్ క్రికెటర్ ఫఖర్ జమాన్ పై మాత్రం మన నెటిజన్లు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. మ్యాచ్ సమయంలో అతను చూపిన క్రీడాస్ఫూర్తికి అందరూ ముగ్ధులౌతున్నారు.
ఇంతకీ ఏం జరిగిందంటే.. పాకిస్తాన్ బ్యాటింగ్ చేస్తుండగా... భారత్ బౌలింగ్ చేస్తున్న సమయం అది. ఆరో ఓవర్ లో ఆవేశ్ ఖాన్ బౌలింగ్ చేస్తున్నాడు. ఆ ఓవర్ లో అప్పటికే రెండు ఫోర్లు కొట్టి జోరు మీద ఉన్నాడు పాక్ క్రికెటర్ ఫఖర్ జమాన్. ఈ క్రమంలో ఆవేశ్ ఖాన్ షార్ట్ పిచ్ వేయగా... అది కాస్త బౌన్స్ అయ్యింది. అయితే.. ఫఖర్ జమాన్ ఆ షాట్ ని మిస్ చేయగా... బంతి వెళ్లి.. వెనక కీపింగ్ చేస్తున్న దినేశ్ కార్తీక్ చేతిలో పడింది.
కార్తీక్ దానిని వికెట్ గా అప్పీల్ చేయలేదు. బాల్.. బ్యాట్ ని తగల్లేదు అని కార్తీక్ అనుకున్నాడు. వాళ్లు అప్పీల్ చేయకున్నా.. ఫఖర్ తాను ఔట్ అయ్యానని.. పెవీలియన్ ని వదిలేశాడు. రిప్లేలో బంతి బ్యాట్ ఎడ్జ్‌ను స్లిక్ చేస్తు వెళ్లినట్లు స్పైక్ వచ్చింది. కాగా... ఆ సమయంలో ఫఖర్ జమాన్ చూపించిన క్రీడా స్ఫూర్తికి అందరూ ఫిదా అయిపోయారు. ప్రత్యర్థి జట్టుకు చెందిన వాడు అయినా.. మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నామంటూ కామెంట్స్ చేయడం గమనార్హం.
