పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య టీ 20 మ్యాచ్ జరుగుతుండగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పాకిస్తాన్ బ్యాట్‌మన్ ఫకర్ భారీ సిక్స్ బాదగా.. బాల్ వెళ్లి స్టేడియం వెలుపల పడింది. ఆ బంతిని తీసుకున్న ఓ ప్రేక్షకుడు అటు నుంచి అటే పారిపోయాడు. దీంతో మ్యాచ్ కాసేపు ఆగిపోయింది.
Pak vs NZ: న్యూజిలాండ్, పాకిస్తాన్ జట్ల మధ్య టీ20 సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. న్యూజిలాండ్‌లోని హామిల్టన్ వేదికగా రెండో మ్యాచ్ జరిగింది. తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన న్యూజిలాండ్ జట్టే రెండో మ్యాచ్‌లోనూ 21 పరుగుల ఆధిక్యతతో గెలిచింది. దీంతో 2-0తో సిరీస్‌ను న్యూజిలాండ్ కైవసం చేసుకుంది. రెండో టీ20 మ్యాచ్ జరుగుతుండగా ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.
194 పరుగులు చేసిన న్యూజిలాండ్‌ను ఓడించడానికి పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్లు క్రీజులో అడుగుపెట్టారు. బాబర్ ఆజామ్, ఫకర్ జమాన్‌లు బ్యాట్లు ఝుళిపిస్తున్నారు. ఇద్దరూ హాఫ్ సెంచరీలు చేశారు. బాబర్ ఆజామ్ ఫోర్లతో చెలరేగగా.. ఫకర్ సిక్సర్లు బాదాడు. ఇలా ఫకర్ కొట్టిన సిక్సర్‌తో బంతి స్టేడియం వెలుపల పడింది.
సాధారణంగా బంతి గ్రౌండ్ బయటపడగా మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులు వెంటనే గ్రౌండ్‌లోకి బంతిని విసిరేస్తారు. మ్యాచ్ కంటిన్యూ అవుతుంది. కానీ, హామిల్టాన్‌లో అలా జరగలేదు. ఫకర్ కొట్టిన బంతిని ఓ ప్రేక్షకుడు పరుగున వెళ్లి పట్టుకున్నాడు. ఆ బంతిని వెనక్కి విసిరేస్తాడని అందరూ చూస్తుండగా.. అతను అలా చేయలేదు. సరికదా.. బంతిని పట్టుకుని అటే పరిగెత్తాడు. బంతితో ఉడాయించాడు. దీంతో ప్రేక్షకులూ ఓ గాడ్ అండూ ఉసూరుమన్నారు. అప్పటి వరకు మ్యాచ్ ఆగిపోయింది.
Also Read : Virat Kohli: భద్రతను ఉల్లంఘించి గ్రౌండ్‌లోకి దూకి కోహ్లీని హగ్ చేసుకున్నాడు.. ఆ యువకుడి పరిస్థితి ఏమిటీ ?
ఇక బంతి తిరిగి వచ్చేలా లేదని నిర్ధారించుకున్నాక అంపైర్ మరో బంతి ని తీసి బౌలర్ చేతిలో పెట్టాడు. మ్యాచ్ కొనసాగింది. న్యూజిలాండ్ విన్ అయింది. మ్యాచ్ ముగిసినా.. బంతిని పట్టుకుని ప్రేక్షకుడు పారిపోతున్న వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో ఇప్పటికీ వైరల్ అవుతున్నాయి.
న్యూజిలాండ్ పేసర్ బెన్ సియర్స్ 6వ ఓవర్ వేస్తుండగా పాకిస్తాన్ ప్లేయర్ ఫకర్ జమాన్ భారీ సిక్స్ కొట్టాడు. స్టేడియం వెలుపల బాల్ పడినప్పుడే ఈ ఘటన జరిగింది.
