ICC Men's T20 World cup 2022: గాయం నుంచి కోలుకున్న షాహీన్ షా ఆఫ్రిదీ... రిజర్వు ప్లేయర్‌గా ఫకార్ జమాన్... షోయబ్ మాలిక్‌కి దక్కని చోటు..

దాయాది పాకిస్తాన్, ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి జట్టును ప్రకటించింది. గాయం కారణంగా ఆసియా కప్ 2022 టోర్నీకి దూరమైన స్టార్ పేసర్ షాహీన్ షా ఆఫ్రిదీ, టీ20 వరల్డ్ కప్‌ ద్వారా రీఎంట్రీ ఇస్తున్నాడు. ఆఫ్రిదీ గాయం, టీ20 వరల్డ్ కప్ సమయానికి తగ్గుతుందా? లేదా? అనే విషయంలో సందేహాలు రేగినా అతను వేగంగా కోలుకోవడంతో వచ్చే నెలలో జరిగే పొట్టి ప్రపంచకప్‌లో బరిలో దిగుతాడని స్పష్టం చేసింది పాకిస్తాన్...

ఈ మధ్య వరుసగా విఫలమవుతూ వస్తున్న సీనియర్ బ్యాటర్ ఫకార్ జమాన్‌ని తుది 15 మంది జట్టు నుంచి తప్పించిన పాకిస్తాన్, అతనికి స్టాండ్ బై ప్లేయర్‌గా చోటు కల్పించింది. సీనియర్ బ్యాటర్ షోయబ్ మాలిక్‌కి మాత్రం పాక్ టీమ్‌లో చోటు దక్కలేదు.

Scroll to load tweet…

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి పాకిస్తాన్ జట్టు ఇది: బాబర్ ఆజమ్ (కెప్టెన్), షాదబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), అసిఫ్ ఆలీ, హైదర్ ఆలీ, హరీస్ రౌఫ్, ఇఫ్తికర్ అహ్మద్, ఖుష్‌దిల్ షా, మహ్మద్ హస్నైన్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ వసీం, నసీం షా, షాహీన్ షా ఆఫ్రిదీ, షాన్ మసూద్, ఉస్మాన్ ఖాదీర్

స్టాండ్ బై ప్లేయర్లు: ఫకార్ జమాన్, మహ్మద్ హరీస్, షానవాజ్ దహానీ

పాకిస్తాన్‌తో పాటు ఆఫ్ఘాన్ కూడా టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి జట్టును ప్రకటించింది. మహ్మద్ నబీ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్న ఆఫ్ఘాన్ టీమ్‌కి నజీబుల్లా జద్రాన్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఇది: మహ్మద్ నబీ (కెప్టెన్), నజీబుల్లా జద్రాన్ (వైస్ కెప్టెన్), రెహ్మనుల్లా గుర్భాజ్ (వికెట్ కీపర్), అజ్మతుల్లా ఒమర్‌జాయ్, దార్విస్ రసూలీ, ఫరీద్ అహ్మద్ మాలిక్, ఫజల్ హక్ ఫరూకీ, హజ్రతుల్లా జజాయి, ఇబ్రహీం జద్రాన్, ముజీబ్ వుర్ రహాం, నవీన్ వుల్ హక్, ఖైస్ అహ్మద్, రషీద్ ఖాన్, సలీం సఫీ, ఉస్మాన్ ఘనీ

స్టాండ్ బై ప్లేయర్లు: అఫ్సర్ జజాయి, షరఫుద్దీన్ అష్రఫ్, రెహ్మత్ షా, గుల్భాదిన్ నైబ్

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి 15 మందితో కూడిన తుది జట్టుని ప్రకటించేందుకు అక్టోబర్ 15ని డెడ్‌లైన్‌గా ప్రకటించింది ఐసీసీ. ఇప్పటిదాకా న్యూజిలాండ్‌తో పాటు శ్రీలంక, యూఏఈ, ఐర్లాండ్, స్కాట్లాండ్, జింబాబ్వే బోర్డులు జట్లను ప్రకటించలేదు...

అక్టోబర్ 16న శ్రీలంక, నమీబియా మధ్య జరిగే మ్యాచ్‌తో టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ గ్రూప్ మ్యాచులు ప్రారంభమవుతాయి. గ్రూప్ స్టేజీలో శ్రీలంక, నమీబియా, యూఏఈ, నెదర్లాండ్స్, వెస్టిండీస్, స్కాట్లాండ్, జింబాబ్వే, ఐర్లాండ్, యూఏఈ.. సూపర్ 12 స్టేజీలో తలబడబోతున్నాయి. అక్టోబర్ 22న ఆస్ట్రేలియా, న్యూజిలండ్ మధ్య జరిగే మ్యాచ్‌లో సూపర్ 12 రౌండ్ మొదలవుతుంది. భారత జట్టు, అక్టోబర్ 23న పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడుతుంది.