Asianet News TeluguAsianet News Telugu

రిటైర్మెంట్ ప్రకటించిన పాక్ క్రికెటర్ మహ్మద్ హఫీజ్... 19 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కి...

షోయబ్ మాలిక్ తర్వాత అంతటి అనుభవం ఉన్న సీనియర్ మోస్ట్ పాకిస్తాన్ క్రికెటర్‌గా మహ్మద్ హఫీజ్... 41 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్‌బై... ఫ్రాంఛైజీ క్రికెట్‌లో కొనసాగుతానంటూ ప్రకటన...

Pakistan All -rounder Mohammad Hafeez announced retirement for International Cricket
Author
India, First Published Jan 3, 2022, 11:33 AM IST

పాకిస్తాన్ క్రికెటర్, ఆల్‌రౌండర్ మహ్మద్ హఫీజ్ అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించాడు. 2003లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో ఆరంగ్రేటం చేసిన మహ్మద్ హఫీజ్, 19 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కి ఫుల్‌ స్టాప్ పెట్టాలని డిసైడ్ అయ్యాడు. పాక్ సీనియర్ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్ తర్వాత అంతటి అనుభవం ఉన్న సీనియర్ మోస్ట్ పాకిస్తాన్ క్రికెటర్ మహ్మద్ హఫీజ్.  టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో న్యూజిలాండ్‌తో జరిగే సెమీ ఫైనల్ మ్యాచే మహ్మద్ హఫీజ్‌కి ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ కానుంది...

Read: 19 ఏళ్ల పురుష క్రికెటర్‌పై అత్యాచారం, వేధింపులు... ఆస్ట్రేలియా జట్టులో కలకలం...

41 ఏళ్ల మహ్మద్ హఫీజ్ 218 వన్డేలు, 115 టీ20 మ్యాచులు ఆడాడు. వన్డేల్లో 11 సెంచరీలు, 38 హాఫ్ సెంచరీలతో 6,614 పరుగులు చేసిన హఫీజ్, బౌలింగ్‌లో 139 వికెట్లు తీశాడు. 115 వన్డేల్లో 14 హాఫ్ సెంచరీలతో 2,440 పరుగులు చేసిన హఫీజ్, 61 వికెట్లు తీశాడు. టీ20ల్లో హఫీజ్ అత్యుత్తమ స్కోరు 99 పరుగులు నాటౌట్...

తన కెరీర్‌లో 55 టెస్టులు ఆడిన మహ్మద్ హఫీజ్ 10 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలతో 3652 పరుగులు చేయడంతో పాటు 53 వికెట్లు పడగొట్టాడు. 2018లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత టెస్టు రిటైర్మెంట్ ప్రకటించిన మహ్మద్ హఫీజ్‌ను తోటి క్రికెటర్లు ‘ది ప్రొఫెసర్’ అంటూ నిక్‌ నేమ్‌తో పిలుస్తారు...

పాక్ మాజీ కెప్టెన్ మిస్బా వుల్ హక్ కెప్టెన్సీలో వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన మహ్మద్ హఫీజ్, ఆ తర్వాత కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. హఫీజ్ కెప్టెన్సీలో 29 మ్యాచులు ఆడిన పాకిస్తాన్ జట్టు 17 విజయాలు అందుకుని, 11 మ్యాచుల్లో ఓడింది. టీ20 వరల్డ్ కప్ 2014లో గ్రూప్ స్టేజ్ నుంచి పాకిస్తాన్ తప్పుకోవడంతో కెప్టెన్సీ నుంచి వైదొలుగుతూ నిర్ణయం తీసుకున్నాడు హఫీజ్...

ఐపీఎల్ ఆడిన పాక్ క్రికెటర్లలో మహ్మద్ హఫీజ్ కూడా ఒకడు. ఐపీఎల్ 2008 సీజన్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ తరుపున 8 మ్యాచులు ఆడిన హఫీజ్ 64 పరుగులు చేసి ఓ వికెట్ తీసుకున్నాడు. 2008 ముంబై దాడుల తర్వాత ఐపీఎల్ 2009 సీజన్‌లో మహ్మద్ హఫీజ్ పాల్గొనలేదు...

ఐపీఎల్‌తో పాటు పాక్ సూపర్ లీగ్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, కరేబియన్ ప్రీమియర్ లీగ్, శ్రీలంక ప్రీమియర్ లీగ్, బిగ్‌బాష్ లీగ్, గ్లోబల్ టీ20 కెనడా, ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియర్ లీగ్, విటాలిటీ బ్లాస్ట్, అబుదాబీ టీ10 లీగుల్లో ఆడిన మహ్మద్ హఫీజ్... టీ20ల్లో మోస్ట్ టాలెంటెడ్ ఆల్‌రౌండర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు...

అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నా వచ్చే పాక్ సూపర్ లీగ్‌తో పాటు ఫ్రాంఛైజీ క్రికెట్‌లో కొనసాగుతానని స్పష్టం చేశాడు మహ్మద్ హఫీజ్. తన కెరీర్‌లో 32 సార్లు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు గెలిచిన మహ్మద్ హఫీజ్, పాక్ తరుపున అత్యధిక సార్లు ఈ అవార్డు గెలిచిన నాలుగో ప్లేయర్‌గా నిలిచాడు...

పాక్ మాజీ ఆల్‌రౌండర్ షాహిదీ ఆఫ్రిదీ 43 సార్లు, వసీం అక్రమ్ 39 సార్లు, ఇంజమామ్ వుల్ హక్ 33 సార్లు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులను పొందారు. హఫీజ్ ఖాతాలో 9 ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు కూడా ఉండడం విశేషం...

Read Also: INDvsSA 2nd Test: ఒక్క దెబ్బకు మూడు రికార్డులు... రెండో టెస్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ ముందు...

మహ్మద్ హఫీజ్, పాకిస్తాన్ తరుపున ఒక్క 2009 టోర్నీ తప్ప, ఇప్పటిదాకా జరిగిన టీ20 వరల్డ్‌కప్ టోర్నీలన్నింటిలోనూ పాల్గొన్నాడు. అయితే యాదృచ్ఛికంగా 2009 టీ20 వరల్డ్‌ కప్ టోర్నీలో పాకిస్తాన్ టైటిల్ గెలవడం విశేషం. 2012 టీ20 వరల్డ్‌ కప్ టోర్నీలో పాకిస్తాన్‌ను సెమీ ఫైనల్‌కి చేర్చిన కెప్టెన్‌గానూ హఫీజ్‌కి మంచి రికార్డు ఉంది...

Follow Us:
Download App:
  • android
  • ios