పసికూన జింబాబ్వే, పాకిస్తాన్‌కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. టీ20లో టాప్ టీమ్‌ మేమేనంటూ మిడిసిపడే పాకిస్తాన్, జింబాబ్వే బౌలర్ల ధాటికి 99 పరుగులకే ఆలౌట్ అయ్యింది. జింబాబ్వేకి, పాక్‌పై ఇదే మొట్టమొదటి టీ20 విజయం...

రెండో టీ20 మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. కుమున్‌కమ్వే 34 పరుగులతో రాణించగా పాక్ బౌలర్లందరికీ వికెట్లు దక్కాయి.
119 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన పాక్ జట్టు, 99 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

దీంతో జింబాబ్వేకి 18 పరుగుల తేడాతో విజయం దక్కింది. కెప్టెన్ బాబర్ ఆజమ్ 45 బంతుల్లో 5 ఫోర్లతో 41 పరుగులు చేయగా, డానిష్ ఆజీజ్ 24 బంతుల్లో 22 పరుగులు చేశాడు.

3.5 ఓవర్లలో 18 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీసిన జింబాబ్వే బౌలర్ లుకే జాగ్వే... పాక్ పతనాన్ని శాసించాడు. ఒకానొక దశలో 78/3 ఉన్న పాక్, ఆ తర్వాత వరుస వికెట్లు కోల్పోయి 21 పరుగుల తేడాతో ఆలౌట్ అయ్యింది. రెండు జట్లు కలిసి 22 మంది బ్యాటింగ్ చేసినా కేవలం 217 పరుగులు మాత్రమే రావడం విశేషం.