Asianet News TeluguAsianet News Telugu

మత్తాలి శివారెడ్డా మజాకా.. ఐపీఎల్ కామెంట్రీలో బోజ్‌పురి రూటే సెపరేటు.. ఇంగ్లీష్ కామెంటేటర్స్ ఎందుకూ పనికిరారు

IPL 2023: శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా మొదలైన  ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో తొలి మ్యాచ్ చెన్నై - గుజరాత్ మధ్య  జరిగింది. ఈ లీగ్  కు ప్రసారకర్తలుగా ఉన్న స్టార్, జియోలు రేటింగుల కోసం పడరాని పాట్లూ పడుతున్నాయి. 

Other Language commentators in Include English in Danger After Bhojpuri commentary becomes Instant Hit in IPL Opener MSV
Author
First Published Apr 1, 2023, 12:18 PM IST

‘నన్ను కొట్టేసి వెళ్లిపోయిన  తర్వాతైనా ఈ మత్తాలి శివారెడ్డి అనేవాడు పలానావాడు. వాడు మామూలోడు కాదు.. వాడింకా చావలేదు. లేవగానే వస్తాడు.. వస్తే ఏసేస్తాడు...’అంటూ అల్లు అర్జున్ నటించిన రేసుగుర్రం సినిమాలో విలన్ గా నటించిన   రవికిషన్  చెప్పిన ఈ డైలాగ్ కు థియేటర్లో విజిల్సే విజిల్స్. వాస్తవానికి ఈ డైలాగ్ ‌కు గాత్రం అందించింది మరో నటుడు (రవిశంకర్) అయినా  సినిమాలో రవికిశోర్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. భోజ్‌పురి సినిమాలో ‘మెగాస్టార్’గా వెలుగొందుతున్న  రవికిషన్ తాజాగా మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు.  రవికిషన్  ఐపీఎల్  లో కామెంట్రీ చెప్పడమే దీనికి కారణం. 

శుక్రవారం మొదలైన ఐపీఎల్ లో  రేటింగులను  దక్కించుకోవడానికి   ఈ లీగ్ కు అధికారిక ప్రసారదారుగా ఉన్న స్టార్ (టెలివిజన్), జియో (డిజిటల్) లు  నానా తంటాలు పడుతున్న విషయం తెలిసిందే.  స్థానిక భాషల్లో ప్రసారమవుతున్న ఈ లీగ్ లో  లోకల్ గా భాగా ఫేమ్ ఉన్నవారితో కామెంట్రీ కూడా చెప్సిస్తున్నాయి  స్టార్, జియోలు. 

ఈ క్రమంలోనే తెలుగులో  ఐపీఎల్  ను స్టార్ నెట్వర్క్ లో   ప్రముఖ నటుడు  నందమూరి బాలకృష్ణ  చెబుతున్నాడు. జియో కూడా ఏం తక్కువ తిన్లేదు. బోజ్‌పురిలో రవికిషన్ తో  కామెంట్రీ  చెప్పించింది.  స్టార్ లో ప్రఖ్యాత కామెంటేటర్లు  డానీ మోరిసన్,  సునీల్ గవాస్కర్,  మాథ్యూ హెడెన్, కెవిన్ పీటర్సన్ లు ఉన్నా.. హిందీలో వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, సంజయ్ మంజ్రేకర్ వంటి దిగ్గజాలు  కామెంట్రీ చెప్పినా నెటిజన్లు మాత్రం   బోజ్‌పురి  కామెంట్రీయే బాగుందని  కామెంట్స్ చేస్తున్నారు. బీహార్ తో పాటు జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో భోజ్‌పురిని ఎక్కువగా మాట్లాడతారు. కాగా కిషన్.. బోజ్‌పురి  నటుడే గాక  ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్‌పూర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంపీగా కూడా ఉన్నారు. 

 

 

మరీ ముఖ్యంగా జియోకు ఇంగ్లీష్ కామెంట్రీ  అయితే మరీ దారుణంగా ఉంది.   క్రిస్ గేల్, గ్రేమ్ స్వాన్, ఏబీ డివిలియర్స్, రాబిన్ ఊతప్పలు   కామెంట్రీ చెప్పినదానికంటే   నవ్వులు, ఇకఇకలు, పకపకలే ఎక్కువున్నాయి.    మ్యాచ్ ను గురించి విశ్లేషించడే కామెంట్రీ అయితే  జియో లో చేసిందైతే కచ్చితంగా అది కాదని  నిన్న మొబైల్స్ లో చూసినవారికి ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios