టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా.. క్రికెట్ లో ఎంత ఫేమసో.. వివిదాలకు కూడా అంతే ఫేమస్. ఎప్పుడూ ఏదో ఒకటి చేసి వివాదంలో చిక్కుకోవడం అతనికి అలవాటే... ప్రముఖ సెలబ్రెటీ పోగ్రామ్... కాఫీ విత్ కరణ్ షోకి వెళ్లిన హార్దిక్ పాండ్యా.. అక్కడ వివాదాస్పద కామెంట్స్ చేసి.. అడ్డంగా బుక్కైన సంగతి తెలిసిందే.

కేఎల్ రాహుల్‌తో కలిసి ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న పాండ్యా.. మహిళలను ఉద్ధేశించి చేసిన వ్యాఖ్యలపై విమర్శల వర్షం కురిసింది. దీంతో ఈ ఇద్దరి క్రికెటర్లపై బీసీసీఐ తాత్కలిక నిషేధం విధించింది. ఆస్ట్రేలియా పర్యటన నుంచి అర్ధాంతరంగా రప్పించింది. ఆ తర్వాత వీరిద్దరు బేషరతుగా క్షమాపణలు చెప్పగా.. బీసీసీఐ నిషేధాన్ని ఎత్తివేసింది.

అయితే.. తాజాగా.. మరోసారీ ఈ కాఫీ ప్రస్తావన వచ్చింది. తాజాగా.. హార్దిక్ పాండ్యా.. దినేష్ కార్తీక్ తన అనుభవాలను పంచుకున్నాడు. అందులో ఈ కాఫీ విషయం కూడా ప్రస్తావనకు వచ్చింది. ఈ సందర్హంగా హార్దిక్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అయ్యాయి.

ఒకసారి కాఫీ తాగే..భారీ మూల్యం చెల్లించుకున్నానని తెలిపాడు.‘నేను అసలు కాఫీ తాగను, గ్రీన్ టీ తాగుతాను. కానీ, ఒకసారి కాఫీ తాగి.. భారీ మూల్యం చెల్లించుకున్నా. స్టార్‌బక్స్‌లో తాగినా.. అంత ఖర్చు అయ్యేది కాదు. అప్పటి నుంచి కాఫీకి దూరంగా ఉంటున్నా'అని హార్థిక్ తెలిపాడు.