Asianet News TeluguAsianet News Telugu

ధోని తరానికి ఒక్కడు: వీడ్కోలుకు ఇంకా టైముంది, ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్

తాజాగా ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్, భారత సంతతి బ్యాట్స్ మెన్ నాసిర్ హుస్సేన్ కూడా భారత మాజీ కెప్టెన్ ధోని రిటైర్మెంట్ పై కొన్ని కీలక వ్యాఖ్యలు చేసాడు. ధోని రిటైర్మెంట్ పై వస్తున్న వార్తలను చూసి సలహాలను చూసి తొందరపడొద్దని కోరాడు. 

Once MS Dhoni is gone, there is no getting him back so don't push Mahi into retirement: Nasser Hussain
Author
Mumbai, First Published Apr 12, 2020, 8:48 AM IST

కరోనా వైరస్ ధాటికి క్రికెట్ మ్యాచులన్నీ వాయిదా పడుతున్నప్పటికీ, ప్రపంచ కప్ లాంటి ప్రతిష్టాత్మక టోర్నీలు సైతం వాయిదా దిశగా ఆలోచనలు చేస్తున్నప్పటికీ, ఐపీఎల్ లాంటి క్రేజీ మెగా ఈవెంట్లు సందిగ్ధంలో ఉన్నప్పటికీ క్రికెట్లో ధోని రిటైర్మెంట్ అనే టాపిక్ పై హాట్ చర్చ మాత్రం ఆగడం లేదు. 

ఇప్పటికి ధోని రిటైర్మెంట్ కి సంబంధించి రకరకాల వాదనలు ఈక్వేషన్స్ చర్చలు క్రికెట్ పండితులతోపాటు అభిమానుల మధ్య నడుస్తూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో ధోనికి సంబంధించిన చర్చ రాకుండా క్రికెట్ కి సంబంధించిన ఏ చర్చ కూడా పూర్తవదంటే అతిశయోక్తి కాదు. 

ఇక తాజాగా ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్, భారత సంతతి బ్యాట్స్ మెన్ నాసిర్ హుస్సేన్ కూడా భారత మాజీ కెప్టెన్ ధోని రిటైర్మెంట్ పై కొన్ని కీలక వ్యాఖ్యలు చేసాడు. ధోని రిటైర్మెంట్ పై వస్తున్న వార్తలను చూసి సలహాలను చూసి తొందరపడొద్దని కోరాడు. 

ఇకపోతే, భారత క్రికెట్‌ దిగ్గజం, ఐసీసీ టోర్నీలు అన్నింటికి నెగ్గిన ఏకైక కెప్టెన్‌ ఎం.ఎస్‌ ధోని. 2019 వన్డే వరల్డ్‌కప్‌ సెమీఫైనల్స్‌ తర్వాత ధోని మళ్లీ మైదానంలో కనిపించలేదు. ఐపీఎల్‌2020తో బ్యాట్‌ పట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నా, కోవిడ్‌-19 దెబ్బకు ఐపీఎల్‌ నిర్వహణ అయోమయంలో పడింది. 

అదే సమయంలో ధోని పునరాగమనం కూడా ఆగిపోయింది. 2020 టీ20 వరల్డ్‌కప్‌ తర్వాత ధోని వీడ్కోలు పలుకుతాడనే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఐపీఎల్‌ సహా టీ20 వరల్డ్‌కప్‌ నిర్వహణ అనుమానంగా మారింది. 

ధోని ముగింపు మైదానం వెలుపలే అవుతుందా? అనే సందేహం సైతం బలపడుతోంది. ఈ పరిస్థితుల్లో ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ నాసిర్‌ హుస్సేన్‌ మహికి మద్దతుగా నిలిచాడు. ఒక్కసారి ధోని ఆటను వీడితే, తిరిగి అతడిని తీసుకురాలేమని హుస్సేన్ తెలిపాడు. 

తరానికి ఒక్కడే ఉండే దిగ్గజం ధోని అని, ఒక్కసారి ఆటను వీడితే అతడిని వెనక్కి తీసుకురాలేమని ఈ మాజీ ఇంగ్లాండ్ సారథి అభిప్రాయపడ్డాడు. . త్వరగా వీడ్కోలు తీసుకునేలా ధోనిపై ఒత్తిడి తేవద్దని, తన మానసిక స్థితిపై ధోనికి మాత్రమే పూర్తి అవగాహన ఉందని,. "జాతీయ జట్టుకు ఆడే సత్తా ఇంకా ధోనిలో ఉందా?" అనే ప్రశ్న వినిపిస్తోందని, తనకు తెలిసి, ధోనిలో ఇంకా క్రికెట్‌ మిగిలే ఉందని నాసిర్‌ హుస్సేన్‌ అన్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios