శ్రీలంక స్టార్ వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ ని పోలీసులు  అరెస్టు చేశారు. ఓ వృద్ధుడి మరణానికి కారణమంటూ  ఆయనను స్థానిక పోలీసులు అరెస్టు చేయడం గమనార్హం. ఆదివారం ఉదయం కొలంబో శివార్లలోని పాత గాలె రోడ్డు వద్ద ఈ ప్రమాదం జరిగింది. సైకిల్‌పై వెళుతున్న 64 ఏళ్ల వృద్ధుడిని మెండిస్‌ నడుపుతున్న ఎస్‌యూవీ కారు వేగంగా ఢీకొట్టడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. 

క్షతగాత్రుడిని హుటాహుటిన సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మరణించాడు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న మెండిస్ ను మెజిస్ట్రేట్‌ ముందు సోమవారం హాజరుపర్చనున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియలనున్నాయి. కాగా.. 25 ఏళ్ల కుశాల్‌ మెండిస్‌ లంక తరఫున 44 టెస్టులు, 76 వన్డేలు ఆడాడు.