Asianet News TeluguAsianet News Telugu

ఇదేం రివ్యూ రా సామి..? బంతి బ్యాటుకు తాకినా సమీక్ష కోరిన బంగ్లాదేశ్ బౌలర్, సారథి.. ఆటాడుకుంటున్న నెటిజన్లు

New Zealand Vs Bangladesh: బౌలర్ వేసిన బంతి నేరుగా బ్యాటుకు తాకినట్టు స్పష్టంగా కనిపిస్తున్నా రివ్యూ కోరడంపై నెటిజన్లు బంగ్లా బౌలర్, కెప్టెన్ ను ఓ ఆటాడుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.  

NZ vs BNG: DRS Howler, Bangladesh's Worst review ever Netizens Trolls
Author
Hyderabad, First Published Jan 4, 2022, 3:36 PM IST

న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్ చరిత్రాత్మక విజయంపై కన్నేసింది.  కివీస్ తో జరుగుతున్న తొలి టెస్టులో ఆ జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. కానీ ఓ రివ్యూ తీసుకుని నవ్వుల పాలైంది. బంతి బ్యాటుకు తాకినట్టు స్పష్టంగా కనిపిస్తున్నా.. బౌలర్ టస్కిన్ అహ్మద్, కెప్టెన్ మొమినల్ హక్ లు రివ్యూ కోరి దానిని వృథా చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. బంతి బ్యాటుకు తాకినట్టు స్పష్టంగా కనిపిస్తున్నా రివ్యూ కోరడంపై నెటిజన్లు బంగ్లా బౌలర్, కెప్టెన్ ను ఓ ఆటాడుకుంటున్నారు. 

ఇన్నింగ్స్  37వ ఓవర్ లో టస్కిన్ అహ్మద్ బౌలింగ్ చేస్తున్నాడు. కివీస్ స్కోరు 90 పరుగుల వద్ద ఉండగా.. రాస్ టేలర్, యంగ్ క్రీజులో ఉన్నారు. అహ్మద్ వేసిన బంతి ని కవర్స్ దిశగా ఆడేందుకు టేలర్ ప్రయత్నించాడు.  బంతి బ్యాటుకు తాకింది. కానీ కాలుకు తాకిందేమోనని భ్రమించిన బౌలర్ అహ్మద్.. అంపైర్ కు అప్పీల్ చేశాడు.  కెప్టెన్ కూడా ఇలాగే అనుకుని అప్పీల్ చేసినా అక్కడ వారికి వ్యతిరేక ఫలితం వెళ్లింది. 

 

దీంతో కెప్టెన్ మొమినల్  సమీక్ష కోరాడు.  కానీ  రివ్యూ లో కూడా వాళ్లకు చేదు ఫలితమే ఎదురైంది. టస్కిన్ వేసిన  బంతి టేలర్ బ్యాటుకు తాకడంతో టీవీ అంపైర్ కూడా  దీనిని నాటౌట్ గా ప్రకటించాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు బంగ్లాదేశ్ ను ట్రోల్ చేస్తున్నారు. 

‘ఇప్పటివరకు చూసిన అత్యంత చెత్త రివ్యూ ఇదే... ’ అని పలువురు ట్రోల్స్ చేస్తుండగా.. దీనికి  బంగ్లా  క్రికెట్ అభిమానులు కూడా అశ్విన్, పాట్ కమిన్స్ ల వీడియోలను షేర్ చేస్తూ పగ తీర్చుకుంటున్నారు. ఓ మ్యాచులో అశ్విన్ బౌల్డ్ అయినా డీఆర్ఎస్ కు (అతడు వెనక్కి తిరిగి చూసుకోలేదు) వెళ్లిన వీడియోను  షేర్ చేస్తున్నారు. 

 

ఇదిలాఉండగా.. తొలి టెస్టులో బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించడానికి సిద్ధమవుతున్నది.  కివీస్ తో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లా జట్టు అద్భుతాలు చేస్తున్నది. తొలి ఇన్నింగ్స్ లో 458 పరుగుల భారీ స్కోరు చేయడమేగాక..  న్యూజిలాండ్ ను 328 పరుగులకే ఆలౌట్ చేశారు బంగ్లా పులులు. ఆపై రెండో ఇన్నింగ్స్ లో ఆ జట్టును 147 పరుగులకే 5 వికెట్లు పడగొట్టారు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి కివీస్ 5 వికెట్లు కోల్పోయి 147 రన్స్ చేసింది. రాస్ టేలర్ (37 నాటౌట్), రచిన్ రవీంద్ర (6 నాటౌట్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం కివీస్ 17 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఐదో రోజు తొలి సెషన్ లో కివీస్ ను బంగ్లా బౌలర్లు దెబ్బకొడితే ఆ దేశం చరిత్ర సృష్టించినట్టే... 

Follow Us:
Download App:
  • android
  • ios