Asianet News TeluguAsianet News Telugu

అదే జెర్సీ.. అదే షాట్.. ఇదెక్కడో చూసినట్టుందే! ఐపీఎల్ ఫైనల్ గెలుపును వన్డే ప్రపంచకప్ తోొ పోల్చిన గుజరాత్

IPL 2022 Finals: ఐపీఎల్-15 ఫైనల్ లో గుజరాత్ టైటాన్స్ ఓపెనింగ్ బ్యాటర్ శుభమన్ గిల్ సిక్సర్ కొట్టి  ఆ జట్టుకు విజయాన్ని అందించాడు. అయితే ఈ విజయాన్ని  గుజరాత్ టైటాన్స్.. టీమిండియా వరల్డ్ కప్ విక్టరీతో పోల్చుతున్నది. 

Number 7 Jersey Finishing with 6: GT Compares Similarities Between IPL 2022 Final and 2011 ODI World Cup
Author
India, First Published May 30, 2022, 5:23 PM IST | Last Updated May 30, 2022, 5:23 PM IST

2011 వన్డే ప్రపంచకప్.. ఇండియా-శ్రీలంకల మధ్య ఫైనల్ మ్యాచ్. అప్పటి భారత సారథి మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్.. కులశేఖర 48.2 ఓవర్ వేశాడు.  బంతి స్టాండ్స్ లోకి వెళ్లింది. అప్పుడు ధోని జెర్సీ నెంబర్ 7.  సిక్సర్ తో ముగించాడు.  సరిగ్గా 11 ఏండ్ల తర్వాత 2022 ఐపీఎల్-15 ఫైనల్. గుజరాత్-రాజస్తాన్ మధ్య మ్యాచ్. గుజరాత్ ఇన్నింగ్స్ లో ఒబెడ్ మెక్ కాయ్  18.1 ఓవర్ వేశాడు. తొలి బంతిని స్టాండ్స్ లోకి పంపాడు గిల్. అంతే.. ఐపీఎల్ లో తొలిసారిగా అడుగుపెట్టిన గుజరాత్.. సగర్వంగా ట్రోఫీని పైకెత్తింది. ఇక్కడా శుభమన్ గిల్ జెర్సీ 7. కొట్టింది సిక్సరే.  ఇదే విషయాన్ని  గుజరాత్ టైటాన్స్  కూడా  తన ట్విటర్ ఖాతాలో చెప్పుకొచ్చింది. 

గిల్ ను ధోని తో పోల్చుతూ  గుజరాత్ టైటాన్స్ ఈ ట్వీట్ చేసింది.   గుజరాత్ టైటాన్స్ గెలిచిన అనంతరం ట్విటర్  వేదికగా స్పందిస్తూ.. ‘నెంబర్ 7 జెర్సీ.. సిక్సర్ తో లాంఛనాన్ని పూర్తి చేసింది.  గ్యారీ, నెహ్రా లు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సంగ (సంగక్కర), మలింగ ల జట్టును చిత్తుగా ఓడించారు... ఇదెక్కడో చూసినట్టుందే..’  అని ట్వీట్ చేసింది. 

ఈ ట్వీట్ లో గుజరాత్ టైటాన్స్ చెప్పినట్టు.. 2011  వన్డే ప్రపంచకప్ లో కూడా శ్రీలంక జట్టు  సారథి కుమార సంగక్కర. మలింగ జట్టులో సభ్యుడు. ఇప్పుడు వాళ్లలో సంగ.. రాజస్థాన్ హెడ్ కోచ్ కాగా  మలింగ ఆ జట్టు ఫాస్ట్ బౌలింగ్ కోచ్ గా సేవలందిస్తున్నాడు. 

 

ఇక ఇప్పటి గుజరాత్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా అప్పటి  టీమిండియా సభ్యుడు.  గుజరాత్ టైటాన్స్ కు మెంటార్ గా సేవలందిస్తున్న గ్యారీ కిర్స్టెన్.. అప్పుడు టీమిండియా కు హెచ్ కోచ్.  అంతా సేమ్ టు సేమ్ ఉంది కదా.. 

 

అందుకే గుజరాత్ ఈ ట్వీట్  చేసింది. ట్విటర్ లో గుజరాత్ ఈ పోస్ట్ చేసిన తర్వాత.. ‘అర్రే నిజమే.. ఇదెక్కడో చూసినట్టుందే..’ అని నెటిజన్లు  ధోని-గిల్ లను  పోల్చుతూ పోస్టులు పెట్టారు. ధోని - గిల్ లతో పాటు హెడ్ కోచ్ లు, మెంటార్ లు కూడా  వాళ్లే కావడంతో పోలిక బాగా కుదిరింది. అయితే గిల్ ను ధోని తో పోల్చడమే  సీఎస్కే సారథి అభిమానులకు నచ్చడం లేదు. మిస్టర్ కూల్ అయిన ధోనితో.. యాటిట్యూడ్ చూపించే  గిల్ కు పోలికేంటని..? వాళ్లు  కారాలు మిరియాలు నూరుతున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios