వెస్టిండీస్ విధ్వంసకర క్రికెటర్ క్రిస్ గేల్... మాన్షి సూపర్ లీగ్ కి గుడ్ బై చెప్పేశాడు. తనకు కనీస మర్యాద కూడా దక్కడం లేదని... తాను జట్టుకి భారంగా మారినట్లు జట్టు సభ్యులు భావిస్తున్నారని ఆయన పేర్కొనడం గమనార్హం.

ఇంతకీ మ్యాటరేంటంటే....  మన దగ్గర ఐపీఎల్ మ్యాచ్ లు ఎలా అయితే ఆడతారో... దక్షిణాఫ్రికాలో మాన్షి సూపర్ లీగ్ ఆడతారు. ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ లీగ్ లో క్రిస్ గేల్.. జోజీ స్టార్స్ ఫ్రాంఛైజీ తరపున ఆడుతున్నాడు. ఈ సీజన్ లో ఇప్పటి వరకు జోజీ స్టార్స్ ఆరు మ్యాచులు ఆడగా... ఒక్కటి కూడా విజయం సాధించలేదు. ఈ క్రమంలో.. గేల్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు.

తాను మాన్షి సూపర్ లీగ్ కి ఇంతటితో వీడ్కోలు పలుకుతున్నట్లు చెప్పాడు. తన ఆవేతనందటినీ కూడా ఆయన మీడియాతో పంచుకున్నారు. తాను వరసగా రెండు, మూడు మ్యాచులు సరిగా ఆడకపోతే చాలు.. జట్టుకి భారంగా కనిపిస్తానని ఆయన అన్నారు.  జట్టులోని సభ్యులు తనను భారంగా భావిస్తున్నారని తాను ఈ నిర్ణయం తీసుకోలేదని.. చెప్పాడు. తాను ఎన్నో సంవత్సరాలుగా ఈ ఫ్రాంఛైజీ క్రికెట్ ఆడుతున్నానని... అప్పటి నుంచి పరిశీలించిన తర్వాతే తనకు ఈ విషయం అర్థమైందని గేల్ పేర్కొన్నాడు. 

కనీసం తనకు మర్యాద కూడా దక్కడం లేదని.. నేను గతంలో ఏమి చేశానో వాళ్లకు గుర్తుంచుకోవడం లేదని గేల్ పేర్కొన్నాడు.  తాను ఫ్రాంఛైజీ గురించి మాట్లాడటం లేదని.. జనాలు ఏమనుకుంటున్నారో మాత్రమే చెబుతున్నట్లు చెప్పాడు.  ఒక్కసారి గేల్ ఫెయిల్ అయ్యాడంటే.. ఇక అతని కెరిర్ ముగిసిపోయినట్లే... అతను మంచి ప్లేయర్ కాదు లాంటి కామెంట్స్ తనపై వేస్తున్నారని గేల్ పేర్కొన్నాడు.