క్రికెట్ ఆడుతూ కుప్పకూలాడు.. గ్రౌండ్ లోనే గుండెపోటుతో ప్లేయర్ మృతి
Noida Techie Collapses: క్రికెట్ ఆడుతుండగా విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఒక ప్లేయర్ బ్యాటింగ్ చేస్తూ గ్రౌండ్ లోనే కుప్పకూలాడు. గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది.
Noida Techie Collapses While Playing Cricket: క్రికెట్ ఆడుతూ గ్రౌండ్ లోనే కుప్పకూలి ఓ ప్లేయర్ ప్రాణాలు కోల్పోయిన విషాదకర ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. నోయిడాకు చెందిన వికాస్ నేగి అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో మృతి చెందాడు. ఆదివారం ఓ కార్పొరేట్ టోర్నమెంట్ లో పాల్గొన్న వికాస్ నాన్ స్ట్రైక్ నుంచి స్ట్రైకర్ గా మారిన తర్వాత వికెట్ల వద్ద ఒక్కసారిగా ఛాతీ పట్టుకుని అక్కడే కుప్పకూలిపోయాడు. అక్కడే ఉన్న ఆటగాళ్లు, సహచరులు వెంటనే సాయం చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. వికాస్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు ప్రకటించారు. అనంతరం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మరణానికి కారణం గుండెపోటు అని తెలిసింది.
IPL 2024: ఐపీఎల్ 2024కు ముహూర్తం ఖరారు.. వేదిక మార్చడం పై క్లారిటీ
వికాస్ కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిన మ్యాచ్ వీడియోలో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇలాంటి ఊహించని మరణాలను చూసి ప్రజలు షాక్ అవుతున్నారు. గతంలో కోవిడ్ -19 పాజిటివ్ వచ్చిన వారిలో వికాస్ నేగి కూడా ఉన్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని చెబుతున్నారు. అతను ఫిట్ గా ఉండేవాడని, ఎప్పుడూ ఢిల్లీ, నోయిడాలో క్రికెట్ ఆడతాడని సమాచారం. ఇదిలావుండగా, ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా గుండెపోటుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా యువతలో గుండెపోటు రావడం ఆందోళనకు దారితీస్తోంది. నేడు ప్రపంచవ్యాప్తంగా గుండెపోటు ప్రాణాంతకంగా ఉండగా, గత ఐదేళ్లలో భారతదేశంలో గుండెపోటు కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
బిజీ లైఫ్ స్టైల్, అనారోగ్యకరమైన అలవాట్లు, క్రమం తప్పకుండా వ్యాయామం చేయకపోవడం, నూనెలో వేయించిన ఆహార పదార్థాల వినియోగం, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల వినియోగం వల్ల ఆరోగ్యం క్షీణించి గుండెపోటు కేసులు పెరుగుతున్నాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి. గతంలో 60 ఏళ్లు పైబడిన వారిలో గుండెపోటు రావడం సర్వసాధారణం. అయితే, ఈ మధ్య కాలంలో 30-40 ఏళ్ల మధ్య వయస్కుల్లో గుండెపోటు పెరుగుతోంది.
IND v AFG: ప్రపంచ రికార్డుతో పాటు ధోనీ రికార్డు బద్దలు కొట్టనున్న రోహిత్ శర్మ