Asianet News TeluguAsianet News Telugu

వైస్ కెప్టెన్‌ లేకుండా తొలి టెస్టులో టీమిండియా... ఎందుకు లేడని అడిగితే హర్భజన్ వింత సమాధానం...

ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా తొలి టెస్టుకి టీమ్‌ని ప్రకటించిన హర్భజన్ సింగ్... ఓపెనర్‌గా రోహిత్ శర్మతో శుబ్‌మన్ గిల్!  కెఎల్ రాహుల్‌కి తుది జట్టులో దక్కని చోటు...

No vice Captain in 1st test India vs Australia, Border Gavaskar trophy, Harbhajan singh replies cra
Author
First Published Feb 8, 2023, 4:45 PM IST

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా, ఆస్ట్రేలియాతో నాగ్‌పూర్ వేదికగా తొలి టెస్టు ఆడనుంది. ఫిబ్రవరి 9న ప్రారంభమయ్యే తొలి టెస్టుకి తుది జట్టు కూర్పు టీమిండియాకి పెను సవాలుగా మారింది. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, తొలి టెస్టుకి టీమ్ ఇలా ఉంటే బాగుంటుందని 11 మంది ప్లేయర్లతో కూడిన ప్లేయింగ్ ఎలెవన్‌ని ప్రకటించాడు...

రోహిత్ శర్మతో పాటు శుబ్‌మన్ గిల్‌ని ఓపెనర్‌గా ఎంచుకున్న హర్భజన్ సింగ్, వన్‌డౌన్‌లో ఛతేశ్వర్ పూజారా, నాలుగో స్థానంలో విరాట్ కోహ్లీలకు అవకాశం ఇచ్చాడు. ఐదో స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌ని సెలక్ట్ చేసిన భజ్జీ, ఆ తర్వాత రవీంద్ర జడేజా, వికెట్ కీపర్‌గా కెఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్‌లకు తుది జట్టులో చోటు కల్పించాడు...

ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు ఫాస్ట్ బౌలర్లకు అవకాశం ఇచ్చిన హర్భజన్ సింగ్, టీమిండియా టెస్టు వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్‌కి తుది జట్టులో చోటు ఇవ్వలేదు. దీనికి ఓ నెటిజన్, ‘వైస్ కెప్టెన్ ఎక్కడ?’ అంటూ కామెంట్ చేశాడు. అయితే Vice స్పెల్లింగ్‌కి బదులుగా Wise అని రాశాడు. 

ఈ ప్రశ్నకు హర్భజన్ సింగ్... ‘Wise ఉండడు, Vice ఉంటాడు. రోహిత్ చాలా wise (తెలివైన) కెప్టెన్’ అంటూ కెఎల్ రాహుల్‌ని ఎందుకు సెలక్ట్ చేయలేదని ప్రశ్నకు తెలివిగా, వ్యంగ్యంగా సమాధానం ఇచ్చాడు...

రోహిత్ శర్మ గాయపడడంతో సౌతాఫ్రికా టూర్‌లో టెస్టులకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన కెఎల్ రాహుల్, జోహన్‌బర్గ్‌లో టెస్టుకి కెప్టెన్సీ కూడా చేశాడు. కోహ్లీ టెస్టు కెప్టెన్సీకి రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత టెస్టుల్లో టీమిండియాకి వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు కెఎల్ రాహుల్. రాహుల్ కెప్టెన్సీలో బంగ్లాదేశ్‌లో రెండు టెస్టులు కూడా నెగ్గింది భారత జట్టు...

ప్రస్తుతం బీభత్సమైన ఫామ్‌లో ఉన్న శుబ్‌మన్ గిల్, ఈ ఏడాది వన్డేల్లో ఓ డబుల్ సెంచరీ, టీ20ల్లో ఓ సెంచరీ బాదేశాడు. దీంతో శుబ్‌మన్ గిల్‌ని ఆడించాలా? కెఎల్ రాహుల్‌ని ఆడించాలా? అనేది టీమిండియాకి పెద్ద ప్రశ్నగా మారింది..

‘ఏ ఫార్మాట్ అయినా ఓపెనింగ్ భాగస్వామ్యం చాలా అవసరం. ఓపెనర్లు సెటిల్ అయితే మిడిల్ ఆర్డర్‌పై ప్రెజర్ తగ్గుతుంది. భారీ స్కోరు చేసేందుకు అవకాశాలు పెరుగుతాయి. నా ఉద్దేశంలో ఆస్ట్రేలియాపై టెస్టు సిరీస్ గెలవాలంటే శుబ్‌మన్ గిల్, రోహిత్ శర్మ కలిసి ఓపెనింగ్ చేయాలి...

శుబ్‌మన్ గిల్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. కెఎల్ రాహుల్ టాప్ ప్లేయర్. అయితే అతను పెద్దగా ఫామ్‌లో లేడు. బంగ్లాతో సిరీస్‌లోనూ ఎలా ఆడాడో చూశాం. గిల్ రికార్డులు బ్రేక్ చేస్తూ సాగుతున్నాడు. అతని రిథమ్ దెబ్బ తినకుండా వాడుకుంటే టీమిండియా సిరీస్ గెలవడం పెద్ద కష్టమేమేమీ కాదు...’ అంటూ తన యూట్యూబ్ ఛానెల్‌లో వ్యాఖ్యలు చేశాడు హర్భజన్ సింగ్...
 

Follow Us:
Download App:
  • android
  • ios