"టూ" అంటూ అరుపు: విరాట్ కోహ్లీకి అంపైర్ మొట్టికాయలు
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి అంపైర్ మొట్టికాయలు వేశాడు. లాథమ్, బ్లండెల్ బ్యాటింగ్ చేస్తుండగా భారత ఫీల్డర్ టూ అంటూ అరవడంపై విరాట్ కోహ్లీని అంపైర్ హెచ్చరించాడు.
క్రైస్ట్ చర్చ్: న్యూజిలాండ్ పై జరిగిన రెండో టెస్టు మ్యాచు చివరి ఇన్నింగ్సులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని అంపైర్ కెటిల్ బరో హెచ్చరించారు. టామ్ లాథమ్, బ్లండెల్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో వారిని అవుట్ చేయడానికి వాడిన ఎత్తుగడపై అంపైర్ మండిపడ్డాడు.
చివరి ఇన్నింగ్సు నాలుగో ఓవరులో ఓ భారత ఫీల్డర్ టూ అంటూ అరవడం వినిపించింది. న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ మరో పరుగు చేయడానికి ప్రయత్నిస్తుండగా ఆ సంఘటన జరిగింది. ఆ విషయాన్ని అంపైర్ రిచర్డ్ కెటిల్ బరో గుర్తించాడు.
Also Read: విలియమన్స్ ను హేళన చేసిన కోహ్లీ: జర్నలిస్టుపై విరుచుకుపడ్డ కెప్టెన్
విరాట్ కోహ్లీ తమ ఆటగాడిని సమర్థించడానికి ప్రయత్నించాడు. రెండో పరుగు తీసే అవకాశం ఉండడంతో అతను ఫైన్ లెగ్ లో ఉన్న ఫీల్డర్ ను అప్రమత్తం చేయడానికి అరిచాడని కోహ్లీ అంపైర్ తో చెప్పాడు.
టూ అరువొద్దు అని కోహ్లీకి అంపైర్ చెప్పాడు. "మీరు అక్కడ టూ అని అరిచారుడు. మీరు అలా చేయకూడదు. మళ్లీ ఇక్కడ అరిచారు, ఇక చాలు" అని అంపైర్ మందలించాడు.
Also Read: కివీస్ తో రెండో టెస్టు మ్యాచ్: పాత కోహ్లీ తిరిగొచ్చాడు, నోటి దురుసు
భారత్ రెండో ఇన్నింగ్సులో 124 పరుగులకే ఆలవుటైంది. తొలి ఇన్నింగ్సులో లభించిన ఆధిక్యతతో 132 పరుగుల స్కోరును ఆస్ట్రేలియా తన రెండో ఇన్నింగ్సులో అధిగమించాల్సి ఉండింది. ఈ స్థితిలో రెండో ఇన్నింగ్సులో టామ్ లాథమ్, బ్లండెల్ బ్యాటింగ్ కు దిగారు.
ఆ పరిస్థితిలో న్యూజిలాండ్ వికెట్లను తీయాల్సిన అనివార్యసమైన స్థితిలో ఇండియా పడింది. ఆ పరిస్థితిలో ఆ సంఘటన చోటు చేసుకుంది.