టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఐపీఎల్ కోసం కసరత్తులు ప్రారంభించాడు. ఆదివారం ఇంగ్లాండ్ తో జరగాల్సిన అన్నిసీరస్ లు పూర్తయ్యాయి. చివరి వన్డే మ్యాచ్ కూడా టీమిండియా గెలవడంతో.. వన్డే సిరీస్ కూడా భారత్ కే దక్కింది. ఇప్పుడు ఇంగ్లాండ్ తో సిరీస్ ముగియడంతో.. ఇండయిన్ క్రికెటర్లంతా ఐపీఎల్ పై దృష్టిపెట్టారు.

ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ముందుగానే ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఇక పాండ్యా బ్రదర్స్, సూర్యకుమార్ యాదవ్ లు కూడా  తమ ముంబయి ఇండియన్స్ జట్టులో చేరిపోయారు. తాజాగా.. కోహ్లీ కూడా ఐపీఎల్ కోసం తన ప్రాక్టీస్ మొదలుపెట్టాడు.

ఈ ఐపీఎల్ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. అంటే.. మహా అయితే ఓ వారం రోజుల వ్యవధి మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో కోహ్లీ తన జట్టు కోసం.. తన శరీరాన్ని మరింత ఫిట్ గా ఉంచుకునేందుకు కసరత్తులు చేయడం మొదలుపెట్టాడు.

ఎక్కువ రోజులు సమయం లేదుకాబట్టి ఎలాంటి విశ్రాంతి లేకుండానే శ్రమించడం మొదలుపెట్టాడు. ఇలా తాను కసరత్తులు చేస్తున్న వీడియోని కోహ్లీ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. త్రెడ్ మిల్ పై నడుస్తూ.. ‘విశ్రాంతి లేదు’ అనే క్యాప్షన్ కూడా జత చేశాడు. కాగా.. ఈ వీడియో ఆర్సీబీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

 

కాగా.. కోహ్లీ వీడియోకి ఏబీ డెవిలియర్స్ స్పందించాడు. తాను కూడా జట్టులో జాయిన్ అవ్వడానికి సర్వం సిద్ధమైనట్లు పేర్కొన్నాడు. కాగా.. డెవిలియర్స్ కూడా ఆర్సీబీ జట్టులో కీలక క్రికెటర్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఐపీఎల్ లో ఆర్సీబీ ఒక్కసారి కూడా విజేతగా నిలవలేదు. దీంతో ఈసారైనా కప్పు సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.