Asianet News TeluguAsianet News Telugu

టీమిండియా తదుపరి కెప్టెన్ అతనే.. కెవిన్ పీటర్సన్..!

 విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి త‌ప్పుకోవ‌డానికి చాలా కాలంగా క‌ఠినమైన‌ బ‌యోబ‌బుల్‌లో ఉండాల్సి రావ‌డ‌మే కార‌ణం కావొచ్చ‌ని చెప్పాడు.

No One Can Beat Him In The Race": Kevin Pietersen Picks India's Next Test Captain
Author
Hyderabad, First Published Jan 22, 2022, 10:47 AM IST

టీమిండియా కెప్టెన్ బాధ్యతల నుంచి.. విరాట్ కోహ్లీ తప్పుకున్న సంగతి తెలిసిందే.  స్వచ్ఛందంగా కోహ్లీనే తప్పుకున్నాడని కొందరు అంటుంటే.. బీసీసీఐ కావాలనే కోహ్లీని తొలగించిందని మరికొందరు ఆరోపిస్తున్నారు. వీటి సంగతి పక్కన పెడితే.. తర్వాత కెప్టెన్సీ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తున్నారనే విషయం మాత్రం ఆసక్తిగా మారింది. ఈ క్రమంలో.. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్  కెవిన్ పీటర్సన్  స్పందించాడు. టీమిండియా తర్వాతి కెప్టెన్ ఎవరు ఉండాలి అనే విషయంపై తన అభిప్రాయాన్ని తెలియజేశాడు.

టీమిండియా త‌దుప‌రి టెస్టు కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ‌కు పీట‌ర్స‌న్ మ‌ద్ద‌తిచ్చాడు. అలాగే విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్ కెప్టెన్సీ నుంచి త‌ప్పుకోవ‌డం త‌న‌ను ఎలాంటి ఆశ్య‌ర్యానికి గురి చేయ‌లేద‌ని ఇంగ్లండ్ మాజీ ఆట‌గాడు కెవిన్ పీట‌ర్స‌న్ అన్నాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి త‌ప్పుకోవ‌డానికి చాలా కాలంగా క‌ఠినమైన‌ బ‌యోబ‌బుల్‌లో ఉండాల్సి రావ‌డ‌మే కార‌ణం కావొచ్చ‌ని చెప్పాడు.

లెజెండ్స్ లీగ్ సంద‌ర్భంగా ఓ క్రీడా ఛానెల్‌తో మాట్లాడిన కెవిన్ పీట‌ర్స‌న్ టీమిండియా హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ‌పై ప్ర‌శంస‌లు కురిపించాడు. కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ అద్బుత‌మైన నిర్ణ‌యాలు తీసుకుంటాడ‌ని కొనియాడాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ సాధించిన రికార్డులే అత‌ని గురించి చెబుతున్నాయ‌న్నాడు. రోహిత్ శ‌ర్మ స‌రైన ఫిట్‌నెస్ సాధిస్తే ప్ర‌స్తుతం వైస్ కెప్టెన్‌గా ఉన్న అత‌డినే టీమిండియాకు టెస్టు కెప్టెన్‌గా నియ‌మించాల‌ని సూచించాడు.
"టీమిండియాకు మంచి అదృష్టం ఉంది. టీమిండియాకు కెప్టెన్‌ను నియ‌మించడానికి చాలా మంది ఉన్నారు. అయితే నేను టెస్ట్‌ కెప్టెన్‌గా ఇద్ద‌రి పేర్లనే చెబుతాను. పంత్ టెస్టుల‌కు కెప్టెన్‌గా అవ‌స‌రం లేదు. వ‌న్డే జ‌ట్టుకు అయితే స‌రే అనుకోవ‌చ్చు. రోహిత్, రాహుల్‌ల‌కు అయితే స‌రే అని చెబుతాను. కానీ నేను రోహిత్ శ‌ర్మ‌కే మ‌ద్ద‌తు ఇస్తాను. రోహిత్ శ‌ర్మ గొప్ప నాయ‌కుడు. అద్భుత‌మైన నిర్ణ‌యాలు తీసుకుంటాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియ‌న్స్‌కు అత‌ను చాలా టైటిల్‌లు అందించాడు. ప్ర‌స్తుతం హెడ్‌కోచ్‌ రాహుల్ ద్రావిడ్ టెస్టు కెప్టెన్‌గా యువ‌కుల‌ను తీసుకుంటాడా లేక సీనియ‌ర్ల‌ను తీసుకుంటాడో వేచి చూడాలి" అని పీట‌ర్స‌న్ చెప్పాడు.

ఈ సంద‌ర్భంగా విరాట్ కోహ్లీ ఒక ఎంట‌ర్‌టైన‌ర్ అని పీట‌ర్సన్ అన్నాడు. ఎలాంటి ఆట‌గాడైనా బ‌యోబ‌బుల్స్‌లో జీవించ‌డం క‌ష్ట‌మ‌న్నాడు. అది ఆట‌గాళ్ల‌ను మాత్ర‌మే కాకుండా వారి కుటుంబాల‌ను కూడా దెబ్బ‌తీస్తుంద‌ని చెప్పుకొచ్చాడు. విరాట్ కోహ్లీ చాలా కాలంగా బ‌యోబబుల్‌లో ఉంటున్నాడ‌ని, అందుకే కెప్టెన్సీ నుంచి త‌ప్పుకున్నాడ‌ని పీట‌ర్స‌న్ చెప్పుకొచ్చాడు. అందుకే కోహ్లీ కెప్టెన్సీ నుంచి త‌ప్పుకోవ‌డం ప‌ట్ల నేను ఆశ్చ‌ర్యం వ్యక్తం చేయ‌డం లేద‌ని చెప్పాడు.

Follow Us:
Download App:
  • android
  • ios