ఐపీఎల్ 2021 ఆరంభానికి ముందే టైటిల్ ఫెవరెట్ జట్లలో ఒక్కటైన కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కి భారీ షాక్ తగిలింది. కేకేఆర్ స్టార్ బ్యాట్స్‌మెన్ నితీశ్ రాణా కరోనాకు గురయ్యాడు. కేకేఆర్ క్యాంపుకి ముందు నిర్వహించిన పరీక్షల్లో నితీశ్ రాణాకి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అతను క్వారంటైన్‌లోకి వెళ్లాడు...

మరో 7 రోజుల్లో ఐపీఎల్ 2021 సీజన్ ప్రారంభం కానుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో కేకేఆర్ ఏప్రిల్11న తొలి మ్యాచ్ ఆడనుంది. ఆ సమయంకల్లా నితీశ్ రాణా కోలుకున్నా, ముందుజాగ్రత్తగా మరికొన్నిరోజులు క్వారంటైన్‌లో ఉండే అవకాశం ఉంది.

దీంతో కేకేఆర్ ఆడే కొన్ని మ్యాచులకు నితీశ్ రాణా దూరం కానున్నాడు. గత నాలుగు సీజన్లుగా అదరగొడుతున్న నితీశ్ రాణా లేకపోతే కోల్‌కత్తా నైట్‌రైడర్స్ బ్యాటింగ్ ఆర్డర్‌పై ఆ ప్రభావం భారీగానే పడుతుంది.