పూరన్ ఉంటే పూన‌కాలే.. కొడితే స్టేడియం బ‌య‌ట‌ప‌డ్డ బాల్.. !

RCB vs LSG: ఐపీఎల్ 2024లో 14వ మ్యాచ్ లో ల‌క్నో టీమ్ బెంగ‌ళూరును 28 ప‌రుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్ లో నికోల‌స్ పూరన్ బ్యాటింగ్, ఫీల్డింగ్ లో అద‌ర‌గొట్టాడు. అద్భుత‌మైన క్యాచ్ ల‌తో పాటు గ్రౌండ్ లో సిక్స‌ర్ల‌ మోత‌మోగించాడు.
 

Nicholas Pooran sends the ball into orbit in RCB vs LSG IPL 2024, Pooran's fearsome innings RMA

RCB vs LSG - IPL 2024 : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్ 2024) 17వ  సీజ‌న్ లో విరాట్ కోహ్లీ టీమ్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్సీబీ) పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. కానీ, వ‌రుస ఓట‌ములు వెంటాడుతూనే ఉన్నాయి. చిన్నస్వామి స్టేడియంలో జ‌రిగిన ఐపీఎల్ 14వ మ్యాచ్ లో బెంగ‌ళూరు-ల‌క్నో టీమ్ లు త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్ లో ల‌క్నో టీమ్ బెంగ‌ళూరుపై పూర్తిగా అధిప‌త్యం ప్ర‌ద‌ర్శించింది. బౌలింగ్, బ్యాటింగ్ లో అద‌ర‌గొట్టి మ‌రో విజ‌యాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ల‌క్నో టీమ్ 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 181 ప‌రుగులు చేసింది. స్టార్ ప్లేయ‌ర్ క్వింట‌న్ డీకాక్ 81 ప‌రుగులు త‌న ఇన్నింగ్స్ తో దుమ్మురేపాడు. త‌న ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు, 5 సిక్స‌ర్ల‌తో బెంగ‌ళూరు బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డ్డాడు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశాలున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ అభిప్రాయాన్ని ఇక్కడ షేర్ చేయండి.

ఈ మ్యాచ్ లో సూప‌ర్ ఇన్నింగ్స్ తో అద‌ర‌గొట్టిన నికోల‌స్ పూరాన్.. గ్రౌండ్ లో తానుంటే పూన‌కాలేన‌ని నిరూపించాడు. దుమ్మురేపే షాట్ల‌తో బౌండ‌రీల మోత మోగించాడు. కేవ‌లం 21 బంతుల్లో 40  ప‌రుగులు ఇన్నింగ్స్ ఆడాడు. త‌న ఇన్నింగ్స్ లో ఒక ఫోరు, 5 సిక్స‌ర్లు బాదాడు. లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) ఇన్నింగ్స్ చివరి ఓవర్లో రీస్ టాప్లీ బౌలింగ్ లో నికోల‌స్ పూరన్ భారీ సిక్స‌ర్ కొట్టాడు. బంతి 106 మీటర్ల దూరం ప్రయాణించి స్టేడియం పైకప్పుపై ప‌డింది. 

అలాగే, పూరన్ వీరోచిత ప్రదర్శన కేవలం ఒక్క షాట్ కే పరిమితం కాలేదు. 19వ ఓవర్లో టాప్లీపై హ్యాట్రిక్ సిక్సర్లు బాదుతూ తన పవర్ హిట్టింగ్ ప‌వ‌ర్ రుచిని చూపించాడు. మహ్మద్ సిరాజ్ వేసిన చివరి ఓవర్లో కూడా పూర‌న్ సిక్సర్ల మోత మోగించాడు. పూరన్ మెరుపులు మెరిపించడంతో ఎల్ఎస్జీ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఫీల్డింగ్ లో కూడా పూర‌న్ దుమ్మురేపాడు. రెండు క్యాచ్ ల‌తో పాటు ఒక ర‌నౌట్ కూడా చేశాడు. దీంతో బెంగ‌ళూరు టీమ్ 153 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. 28 ప‌రుగుల తేడాతో ఓడిపోయింది. 

ఎవ‌డ్రా ఈ మయాంక్ యాద‌వ్.. కోహ్లీ కొంప‌ముంచాడు.. !

 

న‌న్నే సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొల‌గిస్తారా.. బ్యాట్‌తో క్వింటన్ డికాక్ విధ్వంసం 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios