పాకిస్తాన్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌ను 2-0 తేడాతో సొంతం చేసుకుంది ఆతిథ్య న్యూజిలాండ్. హమిల్టన్‌లో జరిగిన రెండో టీ20లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్... నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. పాక్ ప్లేయర్ మహ్మద్ హఫీజ్ 57 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లతో 99 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

న్యూజిలాండ్ బౌలర్ టిమ్ సౌథీ 4 వికెట్లు పడగొట్టాడు. 164 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన కివీస్... కేవలం ఒకే ఒక వికెట్ కోల్పోయి సులువుగా లక్ష్యాన్ని చేధించింది. మార్టిన్ గుప్టిల్ 11 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 21 పరుగులు చేసి అవుట్ అయ్యాడు..

వికెట్ కీపర్ టిమ్ సిఫర్ట్ 63 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 84 పరుగులు... కెప్టెన్ విలియంసన్ 42 బంతుల్లో 8 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 57 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. ఈ ఇద్దరూ రెండో వికెట్‌కి 129 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.