మౌంట్ మాంగనూయ్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ఎక్కువ సార్లు ఔట్ చేసిన ఘనతను న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌథీ సాధించాడు. ఇప్పటి వరకు కోహ్లీని 9 సార్లు అతను ఔట్ చేశాడు. తాను కోహ్లీని ఎక్కువ సార్లు ఎలా ఔట్ చేశాననే విషయంపై అతను మాట్లాడాడు. పిచ్, పరిస్థితులు సహకరించడం వల్లనే విరాటో కోహ్లీని ఎక్కువసార్లు అవుట్ చేయగలిగానని అన్నాడు. 

విరాట్ కోహ్లీ అద్బుతమైన ఆటగాడని, ఎక్కువ బలహీనతలు ఉండవని, కొత్త బంతికి పిచ్ సహకరించిందని, సరైన స్థానంలో బంతిని వేయడం ల్ల కోహ్లీని ఔట్ చేయడం సాధ్యమైందని టిమ్ సౌథీ అన్నాడు. వికెట్లు తీయడం బౌలర్ల బాధ్యత, కోహ్లీ గొప్ప క్రికెట్ అని, మంచి ఫామ్ ఉన్నాడని, లక్ష్య ఛేదనలో అతను చెలరేగే విషయం అందరికీ తెలిసిందేనని, అందుకే అతన్ని ఔట్ చేయడం చాలా బాగుంటుందని, ఎక్కువసార్లు తానే కోహ్లీని పెవిలియన్ కు పంపించానని తనకు తెలియదని అన్నాడు.

Also Read: అతని బౌలింగ్‌ అంటే భయపడుతున్న కోహ్లీ: ఏకంగా 9 సార్లు ఔట్

తమ ఆటగాళ్లలో కొంత మంది గాయాల వల్ల దూరమయ్యారని, ప్రపంచ కప్ తర్వాత తొలి సిరీస్ అయినప్పటికీ తమ వాళ్లు బాగా ఆడారని, కడుపు నొప్పితో ఆడడం కష్టమని సౌథీ అన్నారు. జట్టును కష్టాల్లో వదిలేసి ఉండలేనని, అందుకే ఆడానని అన్నాడు. యువ పేసర్ జేమీసన్ రాణించడం జట్టు, దేశవాలీ క్రికెట్ కు శుభసూచకమని అన్నాడు. 

ఆరంగేట్రంలో జమీసన్ అద్బుతంగా ఆడాడని, చాలా సౌకర్యంగా కనిపించాడని చెప్పాడు. ఆక్లాండ్, హామిల్టన్ లతో పోలిస్తే మౌంట్ మాంగనూయ్ మైదానం అతి మామూలుగా ఉంటుందని ఆయన అన్నాడు.