క్రైస్ట్ చర్చి: న్యూజిలాండ్ పై జరుగుతున్న రెండో టెస్టు మ్యాచు రెండో ఇన్నింగ్సులో భారత్ టాపార్డర్ చెత్త బ్యాటింగ్ కారణంగా మరో ఓటమి దిశగా సాగుతోంది. ఆదివారం ఆట ముగిసే సమయానికి భారత్ ఆరు వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. మొహమ్మద్ షమీ, బుమ్రా బౌలింగ్ ప్రదర్శనను వాడుకోవడంలో బ్యాట్స్ మెన్ విఫలమయ్యారు. రెండో ఇన్నింగ్సులో ఆట ముగిసే సమయానికి రిషబ్ పంత్ 1 పరుగుతో, హనుమ విహారి 5 పరుగులతో క్రీజులో ఉన్నారు.ఆస్ట్రేలియా బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ మూడు వికెట్లు తీశాడు, సౌథీ, గ్రాండ్ హోమ్, వాగ్నర్ తలో వికెట్ పడగొట్టారు. 

న్యూజిలాండ్ పై జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్సులో 89 పరుగులకు ఆరో వికెట్ కోల్పోయింది. ఉమేష్ యాదవ్ ఒకే ఒక పరుగు చేసిన బౌల్ట్ బౌలింగులో అవుటయ్యాడు.

భారత్ 84 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. ఛతేశ్వర్ పుజారా 24 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. అంతకు ముందు అజింక్యా రహానే 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నాలుగో వికెట్ గా అవుటయ్యాడు.

న్యూజిలాండ్ పై జరుగుతున్న రెండో ఇన్నింగ్సులో భారత్ ఆట తీరు దిగదిడుపుగానే ఉంది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి విఫలమయ్యాడు. కేవలం 14 పరుగులు చేసి గ్రాండ్ హోమ్ బౌలింగులో అవుటయ్యాడు. దీంతో భారత్ 51 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 

తొలి ఇన్నింగ్సులో రాణించిన పృథ్వీ షా రెండో ఇన్నింగ్సులో విఫలమయ్యాడు. అతను కేవలం 14 పరుగులు చేసి సౌథీకి దొరికిపోయాడు. మయాంక్ అగర్వాల్ మరోసారి విఫలమయ్యాడు. 3 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బౌల్ట్ వేసిన బంతికి ఎల్బీడబ్ల్యు అయ్యాడు.

Also Read: షమీ తడాఖా: ఎట్టకేలకు కివీస్ ను భయపెట్టిన భారత బౌలర్లు

న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్సులో 235 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్ 7 పరుగుల తొలి ఇన్నింగ్సు ఆధిక్యతను సంపాదించింది. ఆ తర్వాత భారత్ తన రెండో ఇన్నింగ్సును ప్రారంభించింది.

భారత బౌలర్లలో మొహమ్మద్ షమీకి 4 వికెట్లు, బుమ్రాకు 3 వికెట్లు దక్కాయి. రవీంద్ర జడేజా రెండు వికెట్లు తీయగా, ఉమేష్ యాదవ్ 1 వికెట్ పడగొట్టాడు. భారత బౌలర్లు సమిష్టిగా రాణించడంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్సులో ఎక్కువ పరుగులు చేయకుండా అడ్డుకోగలిగారు.

వికెట్ నష్టపోకుండా 63 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ భారత బౌలర్ల ధాటికి చతికిలపడింది. 177 పరుగులకే 8 కీలకమైన వికెట్లను కోల్పోయింది.