Asianet News TeluguAsianet News Telugu

న్యూజిలాండ్ డ్రెస్సింగ్ రూమ్‌లో బుడతడు... క్యాన్సర్‌తో పోరాడుతున్న చిన్నారికి...

NZ vs BAN: క్యాన్సర్‌తో పోరాడుతున్న చిన్నారి కోరిక తీర్చిన న్యూజిలాండ్ క్రికెట్ టీమ్... బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో...

New Zealand vs Bangladesh: kid fighting with Cancer visited to New Zealand Dressing room
Author
India, First Published Jan 3, 2022, 9:29 AM IST

ఐసీసీ డబ్ల్యూటీసీ ఛాంపియన్‌షిప్ గెలిచి, జోరు మీదున్న న్యూజిలాండ్ జట్టు... ప్రస్తుతం స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ ఆడుతోంది. ఈ టెస్టు మ్యాచ్ సమయంలో న్యూజిలాండ్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఓ చిన్నపిల్లాడు, కివీస్ ప్లేయర్లతో మాట్లాడుతూ కనిపించాడు...

సాధారణంగా టీమ్ డ్రెస్సింగ్ రూమ్‌లోకి ప్లేయర్లకు, సహాయక సిబ్బందికి మినహా మిగిలిన వారికి అనుమతి ఉండదు. క్రికెటర్ల కుటుంబ సభ్యులు కూడా డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లడానికి వీలులేదు. అలాంటిది ఈ చిన్నోడు... డ్రెస్సింగ్ రూమ్‌కి ఎలా వచ్చాడు? ఎందుకు వచ్చాడు?...

కివీస్ డ్రెస్సింగ్ రూమ్‌లో ప్లేయర్లతో ముచ్చట్లు పెడుతున్న కుర్రాడి పేరు జాకోబ్. 9 ఏళ్ల జాకోబ్ ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్నాడు. జాకోబ్‌కి క్రికెట్ అంటే పిచ్చి. పెద్దయ్యాక క్రికెటర్ అవ్వాలనేది అతని కోరిక. ఆ కుర్రాడి కోరిక తెలుసుకున్న ఓ ఫౌండేషన్, న్యూజిలాండ్ క్రికెట్ టీమ్‌తో మాట్లాడి ఈ విధంగా ఏర్పాటు చేసింది...

ఆ కుర్రాడిని ఎంతో అప్యాయంగా డ్రెస్సింగ్ రూమ్‌లోకి ఆహ్వానించిన న్యూజిలాండ్ క్రికెట్ టీమ్, అతన్ని ఓ ప్లేయర్‌లా ట్రీట్ చేయడం విశేషం...

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్, మొదటి ఇన్నింగ్స్‌లో 108.1 ఓవర్లలో 328 పరుగులకి ఆలౌట్ అయ్యింది. న్యూజిలాండ్ ప్లేయర్ డివాన్ కాన్వే 122 పరుగులతో సెంచరీ చేయగా, హెన్రీ నికోలస్ 75, విల్ యంగ్ 52 పరుగులు చేశారు. ఆఖరి టెస్టు సిరీస్ ఆడుతున్న రాస్ టేలర్ 31 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...

బంగ్లాదేశ్ బౌలర్లు షోరిఫుల్ ఇస్లాం, మెహెడీ హసన్ మూడేసి వికెట్లు తీయగా మోమినుల్ రెండు, ఇడాబత్ హుస్సేన్ ఓ వికెట్ పడగొట్టాడు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్, గాయం కారణంగా ఈ టెస్టు సిరీస్‌కి దూరంగా ఉంటున్నాడు. ఆ తర్వాత బ్యాటింగ్ మొదలెట్టిన బంగ్లాదేశ్, తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది...

సద్మాన్ ఇస్లాం 22 పరుగులకే అవుట్ అయినా మహ్మదుల్ హసన్ జాయ్ 78, నజీముల్ హుస్సేన్ షాంటో 64 పరుగులు చేయగా ముస్తాఫిజుర్ రహీం 12 పరుగులు చేశాడు. 203 పరుగుల వద్ద నాలుగు వికెట్లు కోల్పోయింది బంగ్లా...

ఈ దశలో కెప్టెన్ మోమినుల్ హక్, లిటన్ దాస్ కలిసి ఐదో వికెట్‌కి శతాధిక భాగస్వామ్యం నెలకొల్పారు. మోమినుల్ 79, లిటన్ దాస్ 70 పరుగులతో క్రీజులో ఉన్న సమయానికి న్యూజిలాండ్‌పై తొలి ఇన్నింగ్స్‌లో 17 పరుగుల ఆధిక్యం సాధించింది బంగ్లాదేశ్. చేతిలో ఇంకా 6 వికెట్లు ఉన్నాయి.

న్యూజిలాండ్ బౌలర్లలో నీల్ వాగ్నర్ 3 వికెట్లు తీయగా ట్రెంట్ బౌల్ట్‌కి ఓ వికెట్ దక్కింది. 2017లో వెల్లింగ్టన్‌లో జరిగిన టెస్టులో న్యూజిలాండ్‌పై తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సంపాదించిన బంగ్లాదేశ్, మొదటి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టు స్కోరును అధిగమించడం ఇది రెండోసారి...

Follow Us:
Download App:
  • android
  • ios