ఐదు నెలల క్రితం అనారోగ్యానికి గురైన న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్ క్రిస్ కెయిర్న్స్... తాజా వైద్య పరీక్షల్లో క్రిస్ కెయిర్న్స్‌కి పేగు క్యాన్సర్ సోకినట్టు నిర్ధారించిన వైద్యులు...
న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్ క్రిస్ కెయిర్న్స్, ఓ షాకింగ్ విషయాన్ని తెలియచేశాడు. తాను ప్రాణాంతక మహమ్మారి అయిన పేగు క్యాన్సర్‌తో పోరాడుతున్నట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు క్రిస్ కెయిర్న్స్...
ఐదు నెలలుగా వెన్ను నొప్పితో బాధపడుతున్నట్టు తెలిపిన క్రిస్ కెయిర్న్స్, ఓ అత్యవసర గుండె ఆపరేషన్ తర్వాత ప్రాణాంతక క్యాన్సర్ సోకినట్టు వైద్యులు నిర్ధారించారని ప్రకటించాడు క్రిస్ కెయిర్న్స్...
51 ఏళ్ల క్రిస్ కెయిర్న్స్, గత ఆగస్టుతో ఓ గుండె ధమని చిట్లిపోవడంతో శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆ సమయంలో ఆయనకి పక్షవాతం కూడా వచ్చింది. దాదాపు 141 రోజుల చికిత్స తర్వాత గత వారమే ఆసుపత్రి నుంచి డిశార్జి అయ్యాడు క్రిస్ కెయిర్న్స్...
తాజాగా శుక్రవారం రెగ్యూలర్ చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్లిన క్రిస్ కెయిర్న్స్‌కి షాకింగ్ విషయాన్ని వెల్లడించారు కాంబెర్రా యూనివర్సటీ ఆసుపత్రి వైద్యులు. ‘నిన్న, నాకు పేగు క్యాన్సర్ సోకిందని డాక్టర్లు తెలిపారు. ఇది నాకు చాలా పెద్ద షాకింగ్ విషయం. రొటీన్ చెకప్‌కి వచ్చిన నేను, ఇలాంటి షాకింగ్ విషయం వినాల్సి వస్తుందని అస్సలు ఊహించలేదు...
మరోసారి వైద్యులతో, స్పెషలిస్టులతో కలిసి సమావేశమయ్యేందుకు సిద్ధమవుతున్నా. నాకు ఇంతటి ప్రాధాన్యం ఇచ్చేవారు నా చుట్టూ ఉండడం ఎంతో అదృష్టం. నా జీవితంలో సాధించిన ప్రతీ విషయానికి నేనెంతగానో గర్వపడుతున్నా...
మరో యుద్ధం ముందుంది. ఈ ఫైట్‌లో నేను అప్పట్‌కట్‌తో మొదటి రౌండ్‌లో విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నా...’ అంటూ రాసుకొచ్చాడు క్రిస్ కెయిర్న్స్...
1989 నుంచి 2006 వరకూ న్యూజిలాండ్ క్రికెట్ టీమ్‌కి ఆడిన క్రిస్ కెయిర్న్స్, తన కెరీర్‌లో 62 టెస్టులు, 215 వన్డేలు, రెండు టీ20 మ్యాచులు ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసీఎల్)లో ఛండీఘర్ టీమ్‌కి కెప్టెన్‌గా వ్యవహరించాడు క్రిస్ కెయిర్న్స్...
2006లో అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించే సమయానికి టెస్టుల్లో 87 సిక్సర్లు బాదిన క్రిస్ కెయిర్న్స్, అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా ఉన్నాడు. ఆ రికార్డును ఆడమ్ గిల్ క్రిస్ట్ అధిగమించాడు. అంతేకాకుండా వన్డేల్లో 75 బంతుల్లో వన్డే సెంచరీ చేసి, అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన న్యూజిలాండ్ బ్యాటర్‌గానూ ఉన్నాడు. ఈ రికార్డును 36 బంతుల్లో సెంచరీ చేసి కోరీ అండర్సన్ అధిగమించాడు.
2008లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న క్రిస్ కెయిర్న్స్, తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలని నిరూపించుకునేందుకు న్యాయపోరాటం చేసి విజయం సాధించాడు. ఇప్పుడు ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధితో పోరాడి, పూర్తి ఆరోగ్యంగా కమ్ బ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నట్టు కామెంట్ల ద్వారా తెలియచేస్తున్నారు క్రికెట్ అభిమానులు...
న్యూజిలాండ్ జట్టుకి వన్డే సారథిగానూ వ్యవహరించిన క్రిస్ కెయిర్న్స్ తండ్రి లాన్స్ కెయిన్స్ కూడా న్యూజిలాండ్ తరుపున అంతర్జాతీయ క్రికెట్ ఆడారు. 62 టెస్టుల్లో 5 సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలతో 3320 పరుగులు చేసిన క్రిస్ కెయిర్న్స్, 218 వికెట్లు తీశాడు. అలాగే వన్డేల్లో 4 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీలతో 4950 పరుగులు చేసి, 201 వికెట్లు పడగొట్టాడు...
