ఏడాదికో మ్యాచ్ ఆడిస్తే ఎలా పర్ఫామ్ చేయగలం... ఐపీఎల్‌లో ఫెయిల్ అవ్వడానికి ఇదే కారణమంటూ ట్వీట్ చేసిన జేమ్స్ నీశమ్... 

ప్రస్తుత క్రికెట్‌లో టాప్ క్లాస్ ఆల్‌రౌండర్లలో జేమ్స్ నీశమ్ ఒకడు. 48 టీ20 మ్యాచులు ఆడిన జేమ్స్ నీశమ్, 25 వికెట్లు తీశాడు. 25.29 సగటుతో 607 పరుగులు చేశాడు. వన్డేల్లో 1400+ పరుగులు చేసిన జేమ్స్ నీశమ్, 69 పరుగులు పడగొట్టాడు. 12 టెస్టుల్లో 2 సెంచరీలతో 709 పరుగులు చేసిన జేమ్స్ నీశమ్, 14 వికెట్లు పడగొట్టాడు...

అయితే ఐపీఎల్‌లో మాత్రం జేమ్స్ నీశమ్‌కి చెప్పుకోదగ్గ రికార్డు లేదు. 2014లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరుపున ఆడిన జేమ్స్ నీశమ్, ఆ తర్వాత ఈ టోర్నీకి దూరంగా ఉన్నాడు. 2020 వేలంలో పంజాబ్ కింగ్స్, 2021 సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరుపున ఆడిన జేమ్స్ నీశమ్, 2022 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకి ఆడాడు...

తాజాగా ఓ అభిమాని, ఈ విషయం గురించే న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ జేమ్స్ నీశమ్‌ని ప్రశ్నించాడు. ‘నువ్వు ఇంటర్నేషనల్ గేమ్స్‌లో ఆడినట్టుగా ఐపీఎల్‌లో ఎందుకు ఆడవు?’ అంటూ ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు తన స్టైల్‌లో సమాధానం ఇచ్చాడు జేమ్స్ నీశమ్...

Scroll to load tweet…

‘ఏడాదికి ఓ మ్యాచ్ ఆడితే అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా బాగా ఆడలేను...’ అంటూ నవ్వుతున్న ఎమోజీని జోడించాడు జేమ్స్ నీశమ్. ఆ తర్వాత ‘చాలామంది ఈ ట్వీట్‌ని ఎవరినో తిడుతున్నట్టు, లేదా ట్రోల్ చేస్తున్నట్టు అర్థం చేసుకుంటున్నారు. క్రికెట్ గురించి అవగాహన ఉన్నవారందరికీ వరుసగా మ్యాచులు ఆడుతున్నప్పుడే బాగా పర్ఫామెన్స్ ఇవ్వగలమనే విషయం తెలుసు.. అయితే పరిస్థితులు అలా రాకపోవచ్చు. ప్లేయర్లే వాటిని తమకు అనుకూలంగా మార్చుకోగలగాలి.. ఇందులో ఎవరి తప్పు లేదు...’ అంటూ వివరణ ఇచ్చాడు జేమ్స్ నీశమ్...

ముంబై ఇండియన్స్ టీమ్‌లో ఉన్నప్పుడు ఐపీఎల్ 2021లో 3 మ్యాచులు ఆడి 5 వికెట్లు తీసిన జేమ్స్ నీశమ్, ట్రెంట్ బౌల్ట్, కిరన్ పోలార్డ్, క్వింటన్ డి కాక్ కారణంగా తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. 2022లో రాజస్థాన్ రాయల్స్ టీమ్‌లో ఉన్నా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు జేమ్స్ నీశమ్. ఈసారి కూడా ట్రెంట్ బౌల్ట్, జోస్ బట్లర్, షిమ్రాన్ హెట్మయర్, రస్సీ వాన్ దేర్ దుస్సేన్ వంటి ప్లేయర్ల కారణంగా తుది జట్టులో జేమ్స్ నీశమ్‌కి అవకాశం దక్కలేదు...

అయితే ఐపీఎల్ 2020లో పంజాబ్ కింగ్స్ తరుపున 5 మ్యాచులు ఆడి 2 వికెట్లు తీసిన జేమ్స్ నీశమ్, బ్యాటింగ్‌లోనూ 19 పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచాడు... పంజాబ్ కింగ్స్ తరుపున అట్టర్ ఫ్లాప్ అయిన గ్లెన్ మ్యాక్స్‌వెల్‌తో పాటు జేమ్స్ నీశమ్, ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో మెరుపులు మెరిపించారు. ఈ సమయంలో పంజాబ్ కెప్టెన్ కెఎల్ రాహుల్‌కి క్షమాపణలు కోరుతూ జేమ్స్ నీశమ్, మ్యాక్స్‌వెల్ వేసిన ట్వీట్లు అప్పట్లో హాట్ టాపిక్ అయ్యాయి...