Asianet News TeluguAsianet News Telugu

సైనీకి ఏమైంది... రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేస్తాడా? లేదా... క్లారిటీ ఎందుకు ఇవ్వడం లేదు...

నవ్‌దీప్ సైనీ గజ్జల్లో గాయం...

రెండో రోజు స్టేడియంలో కనిపించిన నవ్‌దీప్ సైనీ...

సైనీ గాయంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వని బీసీసీఐ...

దాస్తున్నారా? గాయంతోనే ఆడించాలని చూస్తున్నారా?

Navdeep Saini able to play Second Innings in Gabba Test against Australia, BCCI remain silent CRA
Author
India, First Published Jan 17, 2021, 6:35 AM IST

ఆస్ట్రేలియా పర్యటనలో ప్రత్యర్థి కంటే ఎక్కువగా గాయాలు భారత జట్టును ఇబ్బంది పెడుతున్నాయి. మొదటి టెస్టులో మహ్మద్ షమీ, రెండో టెస్టులో ఉమేశ్ యాదవ్ గాయం కారణంగా ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ మధ్యలో నుంచి తప్పుకుంటే... మూడో టెస్టులో గాయపడిన బౌలర్ల సంఖ్య నాలుగుకి చేరింది.

బౌలర్లు బుమ్రా, అశ్విన్, జడేజాతో పాటు హనుమ విహారి కూడా గాయంతో నాలుగో టెస్టుకి దూరమయ్యారు. నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేస్తూ భారత యంగ్ బౌలర్ నవ్‌దీప్ సైనీ గాయపడిన సంగతి తెలిసిందే. 7.5 ఓవర్లు బౌలింగ్ చేసిన సైనీ, గాయంతో పెవిలియన్ చేరడంతో ఆ మిగిలిన బంతిని రోహిత్ శర్మ బౌల్ చేశాడు.

అయితే సైనీ గాయం గురించి బీసీసీఐ ఎలాంటి అప్‌డేట్ ఇవ్వడం లేదు. నిజానికి ఇప్పుడు సైనీ గాయంతో తప్పుకుంటే, కంకూషన్ సబ్‌స్టిట్యూట్‌గా బౌలర్‌గా తీసుకోవడానికి బౌలర్లు ఎవ్వరూ మిగలలేదు.

టీనేజర్ కార్తీక్ త్యాగి మాత్రమే ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్ ఆడకుండా రిజర్వు బెంచ్‌లో నెట్‌బౌలర్‌గా ఉన్నాడు. అందుకే గాయంతోనే సైనీని ఆడించాలని బీసీసీఐ భావిస్తోందని, అందుకే అతని గాయం గురించి క్లారిటీ ఇవ్వడం లేదని టాక్ వినిపిస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios