Asianet News TeluguAsianet News Telugu

తొలి టెస్టు ఆస్ట్రేలియాదే.. విండీస్‌ను తిప్పి ‘ఆరే’సిన ఆసీస్ వెటరన్ స్పిన్నర్

AUSvsWI 1st Test: ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న వెస్టిండీస్  జట్టు   తొలి టెస్టులో  ఘోర పరాభవం పాలైంది.  పెర్త్ వేదికగా ముగిసిన మొదటి టెస్టులో కంగారూలు 164 పరుగుల తేడాతో  విజయదుందుభి మోగించింది. 

Nathan Leon Collapse West Indies, Australia Won Perth Test by 164 wickets
Author
First Published Dec 4, 2022, 1:53 PM IST

పసికూన వెస్టిండీస్ మీద కంగరూలు రెచ్చిపోయారు.  బ్యాటింగ్, బౌలింగ్ అన్ని విభాగాలలో ఆధిక్యం ప్రదర్శించిన ఆస్ట్రేలియా.. పెర్త్ వేదికగా ముగిసిన తొలి టెస్టులో వెస్టిండీస్ ను 164 పరుగుల తేడాతో ఓడించింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన  498 పరుగుల లక్ష్య ఛేదనలో  వెస్టిండీస్.. 333 పరుగులకు ఆలౌట్ అయింది.  విండీస్ సారథి క్రెయిగ్ బ్రాత్‌వైట్.. సెంచరీ (110) తో పోరాడినా   ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్ ధాటికి   కరేబియన్ బ్యాటింగ్ కకావికలమైంది.  

పెర్త్ వేదికగా ముగిసిన తొలి టెస్టులో  టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన  ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 4 వికెట్ల నష్టానికి 598 పరుగులు చేసింది.  లబూషేన్ (204), స్టీవ్ స్మిత్ (200 నాటౌట్) లు డబుల్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. ట్రావిస్ హెడ్ (99) సెంచరీ మిస్ చేసుకున్నాడు. 

తొలి ఇన్నింగ్స్ లో విండీస్.. 283 పరుగులకే ఆలౌట్ అయింది. బ్రాత్‌వైట్ (64), తేజ్ నారాయణ్ చందర్‌పాల్ (51) రాణించారు.  దీంతో ఆసీస్ కు  315 పరుగుల ఆధిక్యం దక్కింది. రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్.. 2 వికెట్ల నష్టానికి  182 పరుగులు చేసింది.   లబూషేన్  (104 నాటౌట్), వార్నర్ (48)  మెరిశారు.  ఫలితంగా  ఆసీస్.. విండీస్ ఎదుట 498 పరుగుల లక్ష్యాన్ని నిలపింది. 

భారీ లక్ష్య ఛేదనలో  కరేబియన్ జట్టు ఓపెనర్లు పోరాడారు.  సారథి బ్రాత్‌వైట్,  చందర్‌పాల్ (45) లు తొలి వికెట్ కు 116 పరుగులు జోడించారు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి విండీస్.. 192-3తో నిలిచింది. అజేయ సెంచరీతో తిరిగి క్రీజులోకి వచ్చిన   బ్రాత్‌వైట్ ఐదో రోజు మరో 9 పరుగులు జోడించి  లియాన్ బౌలింగ్ లో ఔటయ్యాడు. లియాన్.. కైల్ మేయర్స్ (10), రోస్టన్ ఛేజ్ (55) లను కూడా బోల్తా కొట్టించాడు.  జేసన్ హోల్డర్ (3), అల్జారీ జోసెఫ్ (43) లను ట్రావిస్ హెడ్ ఔట్ చేశాడు.   లియాన్ కు ఆరు వికెట్లు దక్కగా హెడ్ కు రెండు,  స్టార్క్, హెజిల్వుడ్ కు తలా ఒక వికెట్ దక్కాయి. 

 

రెండు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా  ఆసీస్ తొలి మ్యాచ్ లో విజయం సాధించి  1-0తో ఆధిక్యంలో ఉంది.  రెండో టెస్టు డిసెంబర్ 8 నుంచి అడిలైడ్ వేదికగా జరుగుతుంది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios