35 పరుగులు చేసి అవుటైన బెన్ స్టోక్స్...16 పరుగుల వద్ద భువీ బౌలింగ్‌లో బెన్ స్టోక్స్ ఇచ్చిన క్యాచ్‌ను జారవిడిచిన హార్ధిక్ పాండ్యా...

మూడో వన్డేలో తుదిజట్టులోకి వచ్చిన నటరాజన్, గత మ్యాచ్‌లో 10 సిక్సర్లతో మోత మోగించిన బెన్ స్టోక్స్‌ని పెవిలియన్ చేర్చాడు. నటరాజన్ బౌలింగ్‌లో శిఖర్ ధావన్ క్యాచ్ పట్టడంలో అవుటై పెవిలియన్ చేరాడు

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

డేంజరస్ బెన్ స్టోక్స్. అయితే ధావన్, బెన్ స్టోక్స్ ఇచ్చిన క్యాచ్ పట్టగానే హార్ధిక్ పాండ్యా ఊపిరి పీల్చుకుని, ‘గబ్బర్’కి తలవంచి దండం పెట్టాడు. దీనికి కారణం భువనేశ్వర్ వేసిన మూడో ఓవర్‌లో బెన్ స్టోక్స్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను జారవిరిచాడు హార్ధిక్ పాండ్యా.

చేతుల్లోకి వచ్చిన క్యాచ్‌ను నేలపాలు చేయడంతో కెప్టెన్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ అండ్ కో ఆశ్చర్యపోయారు. ఆ సమయానికి బెన్ స్టోక్స్ స్కోరు 16 పరుగులే. అప్పటికే ఓపెనర్లు ఇద్దరినీ అవుట్ చేసిన భువీకి ఇంకో వికెట్ దక్కిఉండేది.

View post on Instagram

అందుకే 39 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 35 పరుగులు చేసి బెన్ స్టోక్స్ అవుటైన తర్వాత ఊపిరి పీల్చుకుని, క్యాచ్ పట్టిన ధావన్‌కి దండం పెట్టాడు హార్ధిక్ పాండ్యా.