టీ20 ప్రపంచ కప్ 2024 లో తొలి సూపర్ ఓవర్.. ఒమన్ పై నమీబియా సూపర్ విక్టరీ
Namibia vs Oman: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024లో సోమవారం నమీబియా, ఒమన్ ల మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరిగింది. మ్యాచ్ టై కావడంతో ఈ వరల్డ్ కప్ లో తొలి సూపర్ ఓవర్‌లో ఒమన్ పై నమీబియా సూపర్ విక్టరీ సాధించింది.
First Super Over in T20 World Cup 2024 : టీ20 ప్రపంచ కప్ 2024 లో ఉత్కంఠ మ్యాచ్ ఊర్రుతలూగించింది. ఈ మ్యాచ్ రెండు చిన్న జట్ల మధ్య జరిగినప్పటికీ తీవ్ర ఉత్కంఠను రేపింది. చివరి బంతికి మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్ కు వెళ్లింది. ఈ వరల్డ్ కప్ లో తొలి సూపర్ ఓవర్‌లో ఒమన్ పై నమీబియా సూపర్ విక్టరీ సాధించింది. 2024 టీ20 ప్రపంచకప్‌లో ఇది సూపర్ ఓవర్‌లో జరిగిన మొదటి మ్యాచ్. సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా 21 పరుగులు చేసి ఒమన్‌కు 22 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దీని తర్వాత ఒమన్ జట్టు సూపర్ ఓవర్‌లో 1 వికెట్ కోల్పోయి 10 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఒమన్ అద్భుత పోరాటం..
నమీబియా ఏకపక్షంగా గెలవాల్సిన మ్యాచ్‌ను సూపర్ ఓవర్‌కు తీసుకెళ్లడం ఒమన్ సాధించిన అతిపెద్ద విజయం. అయితే, సూపర్ ఓవర్‌లో నమీబియా ఎలాంటి ఛాన్స్ ఇవ్వలేదు. ఇది ఒమన్ ప్రణాళికలను దెబ్బకొట్టింది. ఈ మ్యాచ్‌లో నమీబియా జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుని ఒమన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్ 19.4 ఓవర్లలో 109 పరుగులకు ఆలౌటైంది. జీషన్ మక్సూద్ 22 పరుగులు, ఖలీద్ కైల్ 34 పరుగుల ఇన్నింగ్స్ ఆడారు. ట్రంపెల్మాన్ 4, వైస్ 3, గెర్హార్డ్ ఎరాస్మస్ 2 వికెట్లు తీసుకున్నారు.
110 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన నమీబియా తడబడుతూనే గెలుపు వైపు పయనించింది. చివరలో ఒమన్ దెబ్బకొట్టడంతో మ్యాచ్ టై అయింది. నమీబియా ప్లేయర్లలో నికోలాస్ డేవిన్ 24, జాన్ ఫ్రైలింక్ 45 పరుగులతో రాణించారు. అయితే, విజయానికి అవసరమై పరుగులు చేయడంలో విఫలం అయ్యారు కానీ, మ్యాచ్ ను టై చేసి సూపర్ ఓవర్ కు తీసుకెళ్లారు. దీంతో సూపర్ ఓవర్ లో నమీబియా బ్యాటింగ్ దిగింది. ఆ టీమ్ ఓపెనర్లు డేవిస్ వైస్, ఏరాస్మస్ లు 6 బంతుల్లో 21 పరుగులు (4,6,2,1,44) చేశారు. 22 పరుగుల సూపర్ ఓవర్ టార్గెట్ లో ఒమన్ కేవలం 10 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది.