Asianet News TeluguAsianet News Telugu

టీ20: చాహర్ దెబ్బకు బంగ్లా విలవిల, సిరీస్ భారత్ వశం

చివరి ట్వంటీ20 మ్యాచులో బంగ్లాదేశ్ ను దీపక్ చాహర్ చావు దెబ్బ తిశాడు. ఆరు వికెట్లు పడగొట్టి బంగ్లాదేశ్ పై భారత్ విజయానికి బాటలు వేశాడు. దీంతో మూడు టీ20 మ్యాచుల సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది.

nagpur t20: bangla wins toss and elects to field
Author
Nagpur, First Published Nov 10, 2019, 6:56 PM IST

నాగపూర్: బంగ్లాదేశ్ తో జరిగిన మూడు మ్యాచుల ట్వంటీ20 సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. సిరీస్ ను 2-1 స్కోరుతో గెలుచుకుంది. చివరిదీ, మూడోది అయిన ట్వంటీ20లో బంగ్లాదేశ్ పై భారత్ 30 పరుగుల తేడాతో విజయం సాధించింది. బంగ్లాను దీపక్ చాహర్ చావు దెబ్బ తిశాడు. చివరి ఓవరులో వరుసగా రెండు వికెట్లు పడగొట్టాడు.

బంగ్లాదేశ్ బ్యాట్స్ మన్ మొహమ్మద్ నయీమ్ శ్రమ వృధా అయింది. అతను 48 బంతుల్లో 81 పరుగులు చేసి, భారత్ ను వణికించాడు. అతన్ని దూబే అవుట్ చేయడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. మొహమ్మద్ మిథున్ 27 పరుగులు చేయగా, మిగతా బంగ్లా బ్యాట్స్ మెన్ ఎవరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. 

దీపక్ చాహర్ దెబ్బకు బంగ్లాదేశ్ విలవిలలాడింది. అతను ఆరు వికెట్లను పడగొట్టాడు. శివమ్ దూబేకు మూడు వికెట్లు దక్కాయి. చాహల్ ఒక్క వికెట్ తీశాడు. 

బంగ్లాదేశ్ తో ఆదివారం జరిగిన చివరి ట్వంటీ20 మ్యాచులో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్ దూకుడుగా ఆడడంతో భారత్ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. అయ్యర్ 33 బంతుల్లో 5 సిక్స్ లు, 3 ఫోర్ల సాయంతో 62 పరుగులు చేశాడు. 

రిషబ్ పంత్ మరోసారి విఫలమయ్యాడు. కేవలం ఆరు పరుగులు చేసి సౌమ్య సర్కార్ కు చిక్కాడు. చివరలో కృణాల్ పాండ్యా 13 బంతుల్లో 22 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు. దూబే 9 పరుగులు చేసిన నాటౌట్ గా మిగిలాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో షఫియుల్ ఇస్లామ్, సౌమ్య సర్కార్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. హుస్సేన్ కు ఒక్క వికెట్ దక్కింది.

అంతకు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ నిరాశపరిచాడు. ఆరు బంతుల్లో కేవలం 2 పరుగులు చేసి షఫియుల్ ఇస్లామ్ బౌలింగులో అవుటయ్యాడు. 

శిఖర్ ధావన్ కూడా ఎక్కువ సేపు నిలబడలేకపోయాడు. షఫియుల్ ఇస్లామ్ బౌలింగులోనే శిఖర్ ధావన్ 19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. దూకుడుగా ఆడే క్రమంలో కెఎల్ రాహుల్ 35 బంతుల్లో ఏడు ఫోర్ల సాయంతో 52 పరుగులు చేసి అమీన్ హుస్సేన్ బౌలింగులో లిటన్ దాస్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరాడు.

భారత్ బాంగ్లాదేశ్ సిరీస్ ఇప్పటికే 1-1తో లెవెల్ అవ్వగా, ఇప్పుడు కీలకమైన సిరీస్ విజేతను డిసైడ్ చేసే మూడవ మ్యాచ్ నాగపూర్ లో జరిగింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచినా బాంగ్లాదేశ్ ఫస్ట్ బ్యాటింగ్ ను భారత్ కు అప్పగించింది. 

పిచ్ రిపోర్టును బట్టి చూస్తే పిచ్ రెండు ఇన్నింగ్స్ ల మధ్య పెద్ద తేడా చూపెట్టపోవచ్చని తెలియవస్తుంది. కాకపోతే ఒకింత స్పిన్ కి మాత్రం అనుకూలంగా ఉన్నట్టు తెలియవస్తుంది. రాత్రి అవడం వల్ల డ్యూ ఫాక్టర్(మంచు)ను పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. 

బంగ్లా కెప్టెన్ మహ్మదుల్లా మాట్లాడుతూ, ఈ మంచు ప్రభావాన్ని పరిగణలోకి తీసుకునే భారత్ కు తొలి బాటింగ్ ఛాన్స్ ఇచ్చినట్టు తెలిపాడు. రోహిత్ శర్మ కూడా టాస్ గెలిస్తే తొలుత తాము కూడా బౌలింగ్ చేసేవాళ్లమని అభిప్రాయపడ్డాడు. 

ఈ మ్యాచ్ లో భారత బౌలింగ్ లైన్ అప్ ఒకింత వీక్ గా కనపడుతుంది. కృనాల్  పాండ్య స్థానంలో మనీష్ పాండే టీంలోకి వచ్చాడు. ఈ నేపథ్యంలో కొత్తగా టీం లోకి వచ్చిన శివమ్ దూబే నాలుగు ఫుల్ ఓవర్ల కోట వేయవలిసి ఉంటుంది. లేదంటే శ్రేయాస్ అయ్యర్ గానీ లేదా వేరే ఎవరైనా ఒక రెండు ఓవర్లు వేయాల్సి ఉంటుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios