Asianet News TeluguAsianet News Telugu

రోహిత్ శర్మకు షాక్: ముంబైపై రాజస్థాన్ రాయల్స్ విజయం

ఐపిఎల్ సీజన్ 12 లో భాగంగా జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ తలబడుతున్నాయి. టాస్ గెలిచిన ఆతిథ్య రాజస్థాన్ జట్టు మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో  ముంబై బ్యాటింగ్ కు దిగింది. 

mumbai vs rajasthan match updates
Author
Jaipur, First Published Apr 20, 2019, 4:22 PM IST

ఐపిఎల్ లో భాగంగా శనివారం జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్ పై రాజస్థాన్ రాయల్స్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఐదు బంతులు మిగిలి ఉండగానే ముంబై తన ముందు ఉంచిన 162 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. పరాగ్ 29 బంతుల్లో 43 పరుగులు చేసి రాజస్థాన్ రాయల్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ముంబై బౌలర్లలో చాహర్ 3 వికెట్లు తీయగా బుమ్రాకు ఒక వికెట్ లభించింది.

ముంబై బౌలర్ చాహల్ విజృంభించినా ఫలితం దక్కలేదు. మిగతా బౌలర్లు రాణించకపోవడంతో ముంబై ఇండియన్స్ ఓటమి పాలైంది.. సొంత మైదానంలో రాజస్థాన్ జట్టు బ్యాట్ మెన్స్ ముగ్గురిని చాహర్ వరుసగా ఔట్ చేసి సత్తా చాటాడు. ఇతడి బౌలింగ్ లోనే బెన్ స్టోక్స్ మూడో వికెట్ రూపంలో పెవిలియన్ కు చేరాడు.

76 పరుగుల స్కోరు వద్ద రాజస్థాన్ శాంసన్ రూపంలో రెండో వికెట్ కోల్పోయింది. కేవలం 19 బంతుల్లోనే 35 పరుగులు చేసిన అతడు చాహర్ బౌలింగ్ లో పొలార్డ్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 162 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ 39 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది. రహానే 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద చాహర్ బౌలింగ్ లో ఔటయ్యాడు. 

ఐపిఎల్ సీజన్ 12 లీగ్ మ్యాచుల్లో భాగంగా శనివారం జైపూర్ లో జరిగిన మ్యాచ్ లో ముంబై మొదట బ్యాటింగ్ చేసి 5 వికెట్ల నష్టానికి 161 పరగులు చేసింది. ముంబై ఓపెనర్ డికాక్( 65) ఒక్కడే హఫ్ సెంచరీతో రాణించాడు. మిగతా బ్యాట్ మెన్స్ అందరూ బొటాబోటీ స్కోరుతో సరిపెట్టారు. దీంతో 161 పరుగులకే పరిమితమైన ముంబై రాజస్థాన్ ముందు 162 పరుగుల లక్ష్యాన్ని వుంచింది. 

రాజస్థాన్ బౌలర్లలో గోపాల్ 2, ఉనద్కత్, ఆర్చర్, బిన్నీ లు ఒక్కో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్ లో ఆర్చర్ పేలవమైన ఫీల్డింగ్ తో మూడు క్యాచ్ లను నేలపాలు చేశాడు. అతడు ఈ క్యాచ్ లు పట్టివుంటే రాజస్ధాన్ ఇంకా పటిష్ట స్ధితిలో వుండేది.   

సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ముంబై నాలుగో వికెట్ కోల్పోయింది. ఆతిథ్య రాజస్థాన్ బౌలర్ ఉనద్కత్ హిట్టర్ కిరణ్ పొలార్డ్ ను క్లీన్ బౌల్డ్ చేసి పెవిలియన్ కు పంపించాడు. దీంతో 124 పరుగుల వద్ద ముంబై నాలుగో వికెట్ కోల్పోయింది.

ముంబై జట్టు వెంవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. 34 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సూర్యకుమార్ యాదవ్, ఆ తర్వాతి ఓవర్లోనే  హాఫ్ సెంచరీతో అదరగొట్టిన డికాక్ ఔటయ్యారు. ఇలా క్రీజులో కుదురుకున్న ఇద్దరు బ్యాట్ మెన్స్ ఒకేసారి ఔటవడంతో ముంబై స్కోరు మందగించింది.

ముంబై ఓపెనర్ డికాక్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. కేవలం 35 బంతుల్లోను యాభై పరుగులు సాధించాడు. ఇతడు దాటిగా ఆడటంతో ముంబై 10 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 87 పరుగులు చేసింది. ఓ వైపు రోహిత్ వికెట్ కోల్పోయి పెవిలియన్ బాట పట్టినా మరో ఓపెనర్ డికాక్ మాత్రం బ్యాటింగ్ జోరును తగ్గించలేదు. అతడు కేవలం 17 బంతుల్లోనే 26 పరుగులు చేసి నాటౌట్ గా బ్యాటింగ్ కొనసాగించాడు.

ఐపిఎల్ సీజన్ 12 లో భాగంగా జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ తలపడ్డాయి. టాస్ గెలిచిన ఆతిథ్య రాజస్థాన్ జట్టు మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో  ముంబై బ్యాటింగ్ కు దిగింది. ఇలా బ్యాటింగ్ కు దిగిన ముంబైకి ఆదిలోనే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ కేవలం 5 పరుగులు మాత్రమే చేసి గోపాల్ బౌలింగ్ రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios