విధ్వంసం.. ఒకే ఓవర్ లో 4,6,6,6,4,6.. ఇన్నిరోజులు ఎక్కడదాచావ్ రొమారియో షెపర్డ్.. !
MI vs DC Romario Shepherd : ఐపీఎల్ 2024 20వ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్-ఢిల్లీ క్యాపిటల్స్ తలపడ్డాయి. తొలి ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్ లు సూపర్ ఇన్నింగ్స్ తో దుమ్మురేపారు.
MI vs DC : ముంబైలోని వాంఖడే స్టేడియంలో సిక్సర్ల మోత మోగింది. ముంబై ప్లేయర్లు సూపర్ ఇన్నింగ్స్ తో ఆదరగొట్టారు. తొలి ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్ లు అద్భుతమైన ఆటతో దుమ్మురేపారు. అయితే, చివరి ఓవర్ లో రొమారియో షెపర్డ్ ఆడిన ఇన్నింగ్స్ ఈ మ్యాచ్ లోనే హైలెట్ గా నిలిచింది. అలాగే ఈ ఐపీఎల్ సీజన్ లో అత్యధిత పరుగులు ఇచ్చిన ఓవర్ గా చెత్త రికార్డును బౌలర్ పేరిట నిలిచింది.
ఐపీఎల్ 2024లో 20వ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్-ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై కి అదరిపోయే ఆరంభాన్ని అందించారు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్. ఆ తర్వాత టిమ్ డెవిడ్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఇక చివరి ఓవర్ లో రొమారియో షెపర్డ్ సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. ఏకంగా 4,6,6,6,4,6 బాది ఏకంగా 32 పరుగులు రాబట్టాడు. ఒకే ఓవర్ లో 32 పరుగులు ఇచ్చిన బౌలర్ గా అన్రిచ్ నోర్ట్జే చెత్త రికార్డును నమోదుచేశాడు.
ఈ మ్యాచ్ లో రొమారియో షెపర్డ్ ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడి కేవలం 20 బంతుల్లోనే 390 స్ట్రైక్ రేటుతో 39 పరుగులతో అజేయంగా నిలిచాడు. అలాగే, టిమ్ డెవిడ్ 45 పరుగులు కొట్టాడు. ప్రారంభంలో రోహిత్ శర్మ బ్యాట్ తో అదరగొట్టాడు. 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 49 పరుగులు కొట్టాడు. మరో ఎండ్ లో ఇషాన్ కిషన్ 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 42 పరుగులు చేశాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా 39 పరుగులు ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 234 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్.
IPL 2024 : జోరుమీదున్న రాజస్థాన్ రాయల్స్ కు బ్యాడ్ న్యూస్.. !