MS Dhoni: ఆ పనికి ధోని ఒక్క పైసా తీసుకోలేదు: బీసీసీఐ ప్రెసిడెంట్ ఆసక్తికర వ్యాఖ్యలు
ICC T20 World Cup: యూఏఈ వేదికగా జరగబోయే ఐసీసీ టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టు మెంటార్ గా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ని నియమించిన విషయం తెలిసిందే. అయితే ఈ టోర్నీ కోసం ధోని ఒక్క పైసా కూడా తీసుకోవడం లేదట.
ఐసీసీ తొలి టీ20 ప్రపంచకప్ నెగ్గిన తర్వాత తిరిగి భారత జట్టు దానిని దక్కించుకోలేదు. ఈ వరల్డ్ కప్ తర్వాత టీ20 భారత జట్టు సారథ్య బాధ్యతల నుంచి Virat Kohli తప్పుకోనున్నాడు. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలనే పట్టుదలతో టీమిండియా ఉంది. ఇందుకు అన్ని రకాలుగా సిద్ధమైన Team India.. క్రికెట్ మాస్టర్ మైండ్ MS Dhoniని భారత జట్టు Mentorగా నియమించింది.
అయితే భారత జట్టుకు మెంటార్ గా నియమితుడైన ధోని.. అందుకోసం ఒక్క పైసా తీసుకోవడం లేదట. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపాడు. ఇదే విషయమై తనను కలిసిన మీడియా ప్రతినిధులతో గంగూలీ ముచ్చటించాడు.
ఇది కూడా చదవండి: MS Dhoni: ఫలితం కంటే ప్రయత్నం గొప్పదన్న ధోని.. బెంగళూరులో ఎంఎస్ ధోని క్రికెట్ అకాడమీ ప్రారంభం
‘భారత జట్టుకు మార్గదర్శకుడిగా వ్యవహరిస్తున్నందుకు గాను ధోని డబ్బులేమీ తీసుకోవడం లేదు’ అని అన్నాడు. ప్రపంచకప్ కోసం జట్టును ప్రకటించినప్పుడే ధోని పేరును కూడా బీసీసీఐ వెల్లడించింది. అయితే దీనికోసం ధోనికి భారీగానే ముట్టజెప్పి ఉంటారని వాదనలు వినపడ్డాయి. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైనా ధోని బ్రాండ్ వాల్యూ తగ్గలేదు. ఇప్పటికీ భారత్ లో బ్రాండ్లకు ధోని, కోహ్లి నే ఫస్ట్ ఛాయిస్. అలాంటి ధోని.. జట్టు కోసం రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా సేవలందిస్తుండటం గమనార్హం.
ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న ధోని.. ప్రతి ఏటా రూ. 15 కోట్ల సాలరీ పొందుతున్నాడు. వచ్చే ఏడాది ధోని Chennai super kings తరఫున ఆడుతాడా..? లేదా..? అనేది సందిగ్ధంగా ఉంది. వచ్చే IPL సీజన్ లో మరో రెండు జట్లు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో వాటి చూపు కూడా ధోనిమీదే ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ధోని భవితవ్యంపై చెన్నై యాజమాన్యం కూడా స్పష్టంగా చెప్పడం లేదు.
ఇది కూడా చదవండి: MS DHONI: చెన్నైకి మెంటార్ గా ధోని? మేనేజ్మెంట్ ఆలోచనా అదే..! ఆక్షన్ కు వెళ్లినా వదలమంటున్న సీఎస్కే యాజమాన్యం
భారత జట్టు తరఫున 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ20 మ్యాచ్ లు ఆడిన ధోని.. అన్ని ఫార్మాట్ లలో మెరుగైన ప్రదర్శనలు చేశాడు. టెస్టుల్లో 4,876 పరుగులు చేసిన ఈ జార్ఖండ్ డైనమైట్.. వన్డేల్లో 10,773.. టీ20లలో 1,617 పరుగులు చేశాడు.