Asianet News TeluguAsianet News Telugu

T20 Worldcup:టీమిండియా త్రో డౌన్ స్పెషలిస్ట్ గా ధోనీ.. ట్విట్టర్ ఏమంటుందంటే..!

తాజాగా త్రోడౌన్ స్పెషలిస్టుగానూ బౌలింగ్ చేస్తూ కనిపించాడు. అందుకు సంబంధించిన ఫోటోలను బీసీసీఐ అభిమానులతో పంచుకుంది. టీమిండియా న్యూ త్రో డౌన్ స్పెషలిస్ట్ అంటూ క్యాప్షన్  ఇవ్వడం విశేషం.

MS Dhoni Turns "Throwdown Specialist" For Team India, Twitter Goes Into Overdrive
Author
Hyderabad, First Published Oct 23, 2021, 3:50 PM IST

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సి ంగ్ ధోనీ ప్రస్తుతం  T20 Worldcup లో జట్టు మెంటార్ గా కొత్త బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ప్రపంచకప్ లో జట్టు ధోనీ సహకారం ఎంతో అవసరమని భావించి బీసీసీ చీఫ్ గంగూలీ, సెక్రటరీ జైషా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ  ఆదివారం.. భారత్- పాకిస్తాన్ జట్లు తలపడేనున్నాయి. ఈ నేపథ్యంలో ధోనీ.. టీమిండియా ఆటగాళ్లతో కలిసి పనిచేస్తున్నాడు.

కాగా.. తాజాగా త్రోడౌన్ స్పెషలిస్టుగానూ బౌలింగ్ చేస్తూ కనిపించాడు. అందుకు సంబంధించిన ఫోటోలను బీసీసీఐ అభిమానులతో పంచుకుంది. టీమిండియా న్యూ త్రో డౌన్ స్పెషలిస్ట్ అంటూ క్యాప్షన్  ఇవ్వడం విశేషం.

 

మహీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నా కెప్టెన్ గా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 14వ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు మరోసారి విజేతగా నిలపెట్టి తనలో సత్తా ఏ మాత్రం తగ్గలేదని నిరూపించాడు. దీంతో.. ప్రపంచకప్ లో మెంటార్ గా అతడి సేవుల టీమిండియాకు ఎంతో ఉపయోగకరం అనడంలో ఎలాంటి సందేహం లేదు.  మరోవైపు ధోనీని ఇలా మార్గనిర్దేశకుడిగా ఎంపిక చేయడం.. రాత్రికి రాత్రే తీసుకున్న నిర్ణయం కాదనది.. దీని వెనక బలమైన చర్చే జరిగిందని గంగూలీ చెప్పాడు.

 

ధోనీని ఎలాగైనా టీమిండియాతో కలిసి పనిచేసేలా చేయాలని జైషాతో చాలా కాలం చర్చలు జరిపినట్లు ఇటీవల వివరించాడు. అతడు ఇప్పటికే రెండు ప్రపంచకప్ లు అందించడాడని.. కోహ్లీ సేనతో కలిపితే జట్టుకు మరింత ప్రయోజనకరం అని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.

కాగా.. బీసీసీఐ  పెట్టిన పోస్టు ప్రస్తుతం ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోంది. నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తుండటం విశేషం. 

Follow Us:
Download App:
  • android
  • ios