రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పోరాడి ఓడింది. 217 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగి నిర్ణీత 20 ఓవర్లలో 200 పరుగులకి పరిమితమైంది. డుప్లిసిస్ 72 పరుగులతో ఒంటరి పోరాటం చేయగా, ధోనీ చివర్లో హ్యాట్రిక్ సిక్సర్లు బాది ఓటమి వ్యత్యాసాన్ని తగ్గించాడు. అయితే ఈ మ్యాచ్‌ల నిజాయితీకి మారుపేరుగా చెప్పుకునే ధోనీ, ఛీటింగ్ చేశాడంటూ ఆరోపిస్తున్నారు క్రికెట్ అభిమానులు. రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో జరిగిన ఓ సంఘటనే ఈ ఆరోపణలకు కారణం.

దీపక్ చాహార్ బౌలింగ్‌లో షాట్ ఆడబోయి మిస్ అయ్యాడు టామ్ కుర్రాన్. దాన్ని అందుకున్న ధోనీ అంపైర్‌కి అప్పీలు చేశాడు. అంపైర్లు అవుట్‌గా ప్రకటించారు. అయితే టీవీ రిప్లైలో ధోనీ, బంతి నేలను తాకిన తర్వాత క్యాచ్ అందుకున్నట్టు స్పష్టంగా కనిపించింది. తాను క్యాచ్ అందుకోలేదని తెలిసినా కూడా అవుట్ అని అప్పీల్ చేసిన ధోనీ... టామ్ కుర్రాన్‌ను ఆపి నాటౌట్‌గా ప్రకటించిన అంపైర్లతో వాదనకు దిగాడు. దీంతో ఎమ్‌ఎస్‌డీ ఛీటింగ్ చేయాలని చూశాడంటూ క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నాడు.

అయితే కొందరు ధోనీ ఫ్యాన్స్ మాత్రం అతను అప్పీలు చేసింది క్యాచ్ అవుట్ కోసం కాదు, ఎల్బీడబ్ల్యూ కోసమని వాదిస్తున్నారు. గేమ్ స్పిరిట్‌కి బెస్ట్ ఎగ్జాంపుల్‌గా ఉండే ధోనీపైన ఇలాంటి ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి. అయితే విజయానికి అవకాశం ఉన్నప్పుడు నెమ్మదిగా బ్యాటింగ్ చేసిన ధోనీ, ఓటమి ఖరారైన తర్వాత సిక్సర్లు బాదడంపైనే ఎక్కువగా చర్చ జరుగుతుండడంతో టామ్ కుర్రాన్ క్యాచ్‌ గురించి చాలామంది పట్టించుకోలేదు.