మహేంద్ర సింగ్ ధోని...ఈ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుతోంది. దేశ రక్షణ కోసం అతడు తనకెంతో ఇష్టమైన క్రికెట్ ను పక్కపపెట్టాడు. వెస్టిండిస్ పర్యటనను  కాదు రెండు నెలల పాటు ఇండియన్ ఆర్మీకి తన సేవలు అందించాలన్ని అతడి నిర్ణయం కొందరు భారతీయుల మనసులను దోచుకుంది. ఇక కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో హింస చెలరేగడానికి అవకాశమున్న జమ్మూ కశ్మీర్ లో అతడు విధులు చేపడుతున్నాడు. ఇలా ఏరికోరి మరీ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కశ్మీర్ లో విధులు చేపడుతున్న అతడి దైర్యానికి యావత్ భారత  ప్రజలు ఫిదా అయ్యారు. 

ఇక ధోని భారత ఆర్మీలో తాను కూడా ఓ సాధారణ జవాన్ అన్నట్లుగానే వ్యవహరిస్తున్నాడు. ఈ విషయం అతడు తన బెటాలియన్ సభ్యులతో వాలీబాల్ ఆడుతున్న వీడియో ద్వారా అర్థమవుతుంది. సహచరులతో అతడు ఎంతలా కలిసిపోయాడో ఈ వీడియో తెలియజేసింది. అంతేకాకుండా ధోని స్వయంగా తన షూస్ ను తానే పాలిష్ చేసుకుంటున్న వీడియో కూడా ఒకటి బయటకు వచ్చింది. ఇలా దేశంలో సెలబ్రిటీ హోదా కలిగిన ధోని దాన్ని పక్కనబెట్టి తన బృందంతో సాధారణంగా జీవిస్తుండటం అభిమానులనే కాదు భారత ప్రజలందరిని  ఆకట్టుకుంటోంది. 

అయితే తాజాగా  ధోనికి సంబంధించిన మరో వీడియో  సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇందులో ధోని సహచర సైనికులకు దైర్యాన్ని నూరిపోస్తూ కనిపించాడు. '' ఏ విషయంలో అయినా తామే గొప్పవారమనే అహంభావం ఎవ్వరికి మంచిది కాదు. క్రికెట్లో నా కంటే గొప్పగా ఆడే ఆటగాళ్లు ఇకముందు రావచ్చు. ఈ సత్యాన్ని గుర్తించాలి.'' అని అన్నాడు. అంతేకాకుండా బాలీవుడ్ మూవీ ''కభీ కభీ''లోని ‘మై పల్‌ దో పల్‌కా షాయర్‌ హు'' అనే పాటను స్వయంగా పాడాడు. మన జీవితంలో ఏ క్షణం శాశ్వతం కాదని...అందువల్లే అవకాశం దొరికినపుడు దేశం కోసం ఏదైనా చేయాలని ధోని సహచరులకు ఈ పాట ద్వారా సూచించాడు.   

వీడియో