టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. కేవలం క్రికెట్ కి సంబంధించిన విషయాలతోనే కాదు... సోషల్ మీడియా పోస్టులతో కూడా వార్తల్లోకి ఎక్కుతూ ఉంటారు., మొన్నటి వరకు ధోనీ రిటైర్మెంట్ గురించే అంతటా చర్చ జరిగింది. దానిపై ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. ఇకపోతే... ధోనీ, ఆయన ముద్దుల కూతురు జీవాకి సంబంధించిన ఫోటోలు, వీడియో ఎప్పూడూ నెట్టింట సందడి చేస్తూనే ఉంటాయి.

తాజాగా... ధోనీ, ఆయన భార్య సాక్షి ధోనీ... సింగర్ జస్సీ గిల్ తో కలిసి ఆనందంగా గడిపారు. వీరంతా కలిసి ఓ ట్రిప్ కి వెళ్లారు. ఆ ట్రిప్ ని నేను ఎప్పటికీ మర్చిపోలేను అంటూ.. జస్సీ గిల్... తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశాడు. దానికి సంబంధించిన ఫోటోలు కూడా పోస్టు చేశారు. ఈ ఫోటోలు ఇప్పుడు ధోనీ అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. 

అంతేకాకుండా... ఇంత గొప్ప ట్రిప్ తనకు ఇచ్చినందుకు ధోనీ, సాక్షిలకు దన్యవాదాలు తెలియజేశాడు. జస్సీ గిల్ ఇటీవల తన 31వ పుట్టిన రోజు జరుపుకున్నాడు. ఈ వేడుకల్లో కూడా ధోనీ దంపతులు పాల్గొన్నారు. ఆ ఫోటోలను జస్సీ తన ఇన్ స్టాగ్రామ్ స్టేటస్ లో పెట్టుకున్నాడు. 

 

ఇదిలా ఉండగా... ధోనీ ప్రపంచకప్ తర్వాత మళ్లీ బ్యాట్ పట్టింది లేదు. దీంతో... ఆయన మళ్లీ ఎప్పుడు వచ్చి... జట్టుతో కలుస్తారోనని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. వరల్డ్ కప్ తర్వాతి మ్యాచుల్లో ధోనీకి బదులు పంత్ ని తీసుకోగా... అతను మాత్రం ఆకట్టుకోలేకపోయాడు.