టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని ఆయన భార్య సాక్షి ధోనీ అడ్డంగా బుక్ చేశారు.  ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కేవలం వీడియో మాత్రమే కాదు.. ఫోటోస్ కూడా ట్రెండ్ అవుతున్నాయి. ఆ ఫోటోల్లో ధోనీ ఎక్స్ ప్రెషన్స్ కూడా చాలా ఫన్నీగా ఉండటం విశేషం.

ఇంతకీ మ్యాటరేంటంటే... వన్డే వరల్డ్ కప్ తర్వాత మళ్లీ ధోనీ బ్యాట్ పట్టింది లేదు. కొద్ది రోజులు ఆర్మీలో సేవలు అందించిన ఆయన ఆ తర్వాత కుటుంబంతో ఎంజాయ్ చేస్తున్నాడు. స్నేహితులతో ట్రిప్ లకు వెళ్లడం.. ప్రైవేట్ ఫంక్షన్స్ లో హాజరౌతూ సందడి చేస్తున్నాడు.

Also Read న్యూజిలాండ్ సిరీస్: "తొలి" సిరీస్ విజయమా... మరో ఆస్ట్రేలియా రిపీటా?...

ఇటీవల భార్యతో కలిసి ఓ కార్యక్రమానికి వచ్చిన ధోనీ... స్టేజ్ ఎక్కడానికి సిగ్గుపడుతుంటే... ఆయన భార్య పట్టుకొని బుక్ చేసేసింది. త‌న బయోగ్రఫీ ఆధారంగా నిర్మించిన ఎంఎస్ ధోనీ- ది అన్‌టోల్డ్ స్టోరీ చిత్రంలోని ఓ పాట‌ను బాలీవుడ్ సింగర్ అర్మాన్ మాలిక్ పాడాడు. పాడుతూనే ధోనిని స్టేజ్ పైకి రావాల‌ని సూచించాడు.

 రెండు అడుగులు వేసిన ధోనీ.. సిగ్గు ప‌డుతూ. వామ్మో నేను రాను  అంటూ వెన‌క్కి త‌గ్గి దూరంగా వెళ్లే ప్రయత్నం చేశాడు. కానీ సాక్షి అతనిని ఆపేసింది. అంతేకాకుండా పాట పాడించను అని మాలిక్ హామీ ఇవ్వడంతో ధోని.. సాక్షితో క‌లిసి స్టేజ్‌పైకి వచ్చాడు. మాలిక్ పాడిన పాట‌ను ఆస్వాదిస్తూ చ‌ప్ప‌ట్లతో ఆనందాన్ని వ్యక్తం చేశాడు. సోష‌ల్ మీడియాలో తాజాగా ఈ వీడియోను పోస్టు చేయ‌గా.. వైర‌లైంది.