ముంబై: ఆంతర్జాతీయ క్రికెట్ కు టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ గుడ్ బై చెబుతారని పుకార్లు ఊపందకుున్నాయి. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రకటనతో ఆ ప్రచారం మరింత ముమ్మరమైంది. ధోనీతో కలిసి తాను చేసిన ఆ పరుగును మరిచిపోలేనని కోహ్లీ అన్నాడు.

ధోనీ గురువారం సాయంత్రం 7 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి తన రిటైర్మెంట్ విషయాన్ని ప్రకటిస్తారని భావిస్తున్నారు. ధోనీ ఏం మాట్లాడుతారనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా, ధోనీ రిటైర్మెంటుపై తమకు ఏ విధమైన సమాచారం లేదని బిసిసిఐ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నారు. 

దక్షిణాఫ్రికాతో సిరీస్ ప్రారంభం కావడానికి ఇక మూడు రోజులు మాత్రమే ఉన్న స్థితిలో ధోనీ రిటైర్మెంట్ పుకార్లు ముమ్మరమయ్యాయి. టీమిండియాకు పలు విజయాలు అందించిన ధోనీ ప్రపంచ క్రికెట్ లో తనదైన ముద్ర వేశాడు. సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా పేరు తెచ్చుకున్నాడు. ప్రపంచంలోని అత్యుత్తమ కెప్టెన్లలో ఒక్కడిగా, తిరుగులేని వికెట్ కీపర్ గా పేరు తెచ్చుకున్నాడు.

టీమిండియాకు దూకుడును నేర్పింది సౌరవ్ గంగూలీ అయితే  ఆ దూకుడును కొనసాగిిస్తూ విజయాల రుచిని చూపించినవాడు ధోనీ. జార్ఖండ్ డైనమెట్ గా పేరు గాంచిన ధోనీని కెప్టెన్ కూల్ గా పిలుచుకుంటారు. విజయాలతో పొంగిపోకుండా, అపజయాలతో కృంగిపోకుండా ఆయన క్రికెట్ ప్రయాణం సాగింది.