ఐపీఎల్ 2021 సీజన్‌కి అర్ధాంతరంగా బ్రేక్ పడడంతో రాంఛీ చేరుకున్న ధోనీ...తన గుర్రాన్ని ప్రేమగా నిమురుతున్న వీడియోను పోస్టు చేసిన సాక్షి సింగ్ ధోనీ...

మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్‌గా అంత సక్సెస్ సాధించడానికి, అతను తన టీమ్ నుంచి బెస్ట్ రిజల్ట్ రాబట్టడమే కారణం. భారత జట్టు ప్లేయర్లు మాత్రమే కాదు, సామ్ కుర్రాన్, మొయిన్ ఆలీ వంటి విదేశీ ప్లేయర్లను కూడా ఎలా వాడుకోవాలో ధోనీకి తెలిసినట్టు ఇంగ్లాండ్ జట్టుకి కూడా తెలీదేమో అనిపించింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఆటగాళ్ల నుంచి బెస్ట్ రిజల్ట్ రాబట్టడానికి కారణం మహేంద్ర సింగ్ ధోనీ చూపించే కేర్. తన జట్టులోని ప్రతీ ప్లేయర్, సహాయక సిబ్బంది... ఆఖరికి బస్సు డ్రైవర్, క్లీనర్ విషయంలో కూడా ఎంతో వినయంగా నడుచుకుంటాడు ధోనీ. వీలైనప్పుడల్లా తన పెంపుడు కుక్కతో ఆడుకునే ధోనీకి ఓ పెంపుడు గుర్రం కూడా ఉంది.

View post on Instagram

ఐపీఎల్ 2021 సీజన్‌కి అర్ధాంతరంగా బ్రేక్ పడడంతో రాంఛీ చేరుకున్న ధోనీ, తన గుర్రాన్ని ప్రేమగా నిమురుతున్న వీడియోను పోస్టు చేసింది సాక్షి సింగ్. ఈ ఫోటోతో పాటు 2009లో గల్లీ కుర్రాళ్లతో కలిసి ఆడుకుంటున్న ధోనీ ఫోటోను షేర్ చేసింది సాక్షి.