Asianet News TeluguAsianet News Telugu

చెపాక్ స్టేడియంలో సీట్లకు ఎల్లో పెయింట్ వేసిన మహేంద్ర సింగ్ ధోనీ... వీడియో పోస్ట్ చేసిన సీఎస్‌కే...

మూడు సీజన్ల తర్వాత సొంత మైదానంలో మ్యాచులు ఆడబోతున్న చెన్నై సూపర్ కింగ్స్.. చెపాక్ స్టేడియంలో ఫ్యాన్స్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు! గ్రౌండ్ సిబ్బందితో కలిసి సీట్లకు పెయింట్ వేసిన ధోనీ.. 

MS Dhoni paints yellow colour for seats in Chepak stadium before IPL 2023 season, CSK shares video cra
Author
First Published Mar 27, 2023, 11:23 AM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16 సందడి మొదలైపోయింది. మార్చి 31న డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, 2021 సీజన్ విన్నర్ చెన్నై సూపర్ కింగ్స్‌తో తొలి మ్యాచ్ ఆడబోతోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి...

ఐపీఎల్ 2022 సీజన్ తర్వాత క్రికెట్‌కి దూరంగా ఉంటున్న మహేంద్ర సింగ్ ధోనీ, మళ్లీ ఏడాది తర్వాత బరిలో దిగబోతున్నాడు. ఐపీఎల్ 2023 సీజన్ కోసం రెండు నెలల ముందు నుంచే క్రికెట్ ప్రాక్టీస్ మొదలెట్టేశాడు మాహీ. ధోనీకి ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్ అని కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది..


స్టార్ స్పోర్ట్స్ తమిళ్ ఛానెల్, ధోనీ ఫేర్‌వెల్ సీజన్‌గా ఐపీఎల్ 2023 సీజన్‌ని ప్రమోట్ చేస్తోంది. అయితే సీఎస్‌కే ప్లేయర్లు దీపక్ చాహార్, రుతురాజ్ గైక్వాడ్ మాత్రం ధోనీకి ఇది ఆఖరి సీజన్ కాదని, కాబోదని.. అతను ఇంకా రెండు మూడు సీజన్లు ఆడతాడని కామెంట్లు చేశారు...

మూడు సీజన్‌ల తర్వాత సొంత మైదానం చెన్నైలోని చెపాక్ స్టేడియం (ఎంఏ చిదంబరం స్టేడయం)లో మ్యాచ్‌లు ఆడబోతోంది చెన్నై సూపర్ కింగ్స్. ఐపీఎల్ 2020 సీజన్ కరోనా లాక్‌డౌన్ కారణంగా పూర్తిగా యూఏఈలో జరిగింది..

2021 సీజన్‌ ఫస్ట్ ఫేజ్‌లో చెన్నైలో మ్యాచులు జరిగినా సొంత మైదానం అడ్వాంటేజ్ ఉంటుందనే ఉద్దేశంతో సీఎస్‌కే మ్యాచులు జరగలేదు. 2022 సీజన్‌లోనూ చెన్నైలో మ్యాచులు నిర్వహించలేదు. ఎట్టకేలకు 2019 తర్వాత తొలిసారిగా సొంత మైదానంలో, సొంత అభిమానుల మధ్య మ్యాచులు ఆడబోతోంది చెన్నై సూపర్ కింగ్స్...

ఐపీఎల్ 2023 సీజన్‌లో సీఎస్‌కే ఆడబోయే మొదటి నాలుగు మ్యాచులకు సంబంధించిన టికెట్లన్నీ ఇప్పటికే అమ్ముడైపోయాయి. మిగిలిన మ్యాచుల టికెట్లకు కూడా భారీ క్రేజ్ ఏర్పడింది. దీంతో చిదంబరం స్టేడియంలో కొన్ని కొత్త స్టాండ్స్‌ని పునర్మించింది తమిళనాడు క్రికెట్ అసోసియేషన్...

చెపాక్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్న మహేంద్ర సింగ్ ధోనీ, గ్రౌండ్ సిబ్బందితో కలిసి సీట్లకు ఎల్లో పెయింట్ వేశాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది చెన్నై సూపర్ కింగ్స్.. సీట్లకు పసుపు రంగు వేసిన ధోనీ.. ‘ఇప్పుడు కచ్చితంగా ఎల్లోలవ్‌లా కనిపిస్తోంది...’ అంటూ కామెంట్ చేశాడు..

ఐపీఎల్ 2022 సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలో దిగిన చెన్నై సూపర్ కింగ్స్ చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయింది. సీజన్ ఆరంభానికి 2 రోజుల ముందు ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించడం, రవీంద్ర జడేజా కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకోవడం జరిగిపోయాయి..

అయితే మొదటి 4 మ్యాచుల్లో ఓడిన తర్వాత తొలి విజయాన్ని అందుకున్న సీఎస్‌కే, ఆ జోరుని కొనసాగించలేకపోయింది. 8 మ్యాచుల్లో రెండే విజయాలు అందుకున్న రవీంద్ర జడేజా... కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు నిర్ణయం తీసుకున్నాడు. దీంతో మళ్లీ కెప్టెన్‌గా ధోనీ బాధ్యతలు తీసుకున్నాడు..

అయినా విజయాల బాట పట్టలేకపోయిన సీఎస్‌కే, 14 మ్యాచుల్లో 4 విజయాలు మాత్రమే అందుకుని పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది. సీఎస్‌కే ఫెయిల్యూర్ కారణంగా ఐపీఎల్ 2022 సీజన్‌కి అనుకున్నంత టీఆర్‌పీ రాలేదు..

ఐపీఎల్ 2022 మినీ వేలంలో బెన్ స్టోక్స్‌ని రూ.16.25 కోట్లకు కొనుగోలు చేసిన సీఎస్‌కే, ఈ సీజన్‌లో భారీ అంచనాలతో బరిలో దిగుతోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios