Asianet News TeluguAsianet News Telugu

వన్డే వరల్డ్ కప్ 2023 ముందు ‘ఓరియో’ యాడ్‌తో మళ్లీ వచ్చేసిన ధోనీ... ఈసారి దిష్టి తగులుతుందంటూ..

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ముందు ‘ఓరియో’ బిస్కెట్ యాడ్‌ చేసిన ధోనీ.. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ఆరంభానికి ముందు వినూత్న కాన్సెప్ట్‌తో.. 

MS Dhoni new Oreo Advertisement before ICC ODI World cup 2023, fans expects CRA
Author
First Published Oct 5, 2023, 5:29 PM IST

మహేంద్ర సింగ్ ధోనీ, పక్కా కమర్షియల్ పర్సన్. రాజకీయ, సామాజిక, క్రికెట్ సంబంధిత విషయాల గురించి ఒక్క పోస్ట్ కూడా చేయని మహేంద్రుడు, ప్రమోషనల్ పోస్టులు చేయడానికి మాత్రమే తన సోషల్ మీడియా ఖాతాలను వాడుతున్నాడు.  వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ఆరంభానికి ముందు మరో యాడ్‌తో వచ్చేశాడు ధోనీ..

ఓ న్యూస్ ప్రోగ్రామ్‌కి సడెన్‌గా వెళ్లే మహేంద్ర సింగ్ ధోనీ, అక్కడి న్యూస్ యాంకర్ల ‘భారత జట్టు విజయావకాశాల గురించి అస్సలు మాట్లాడకండి’ అంటూ సలహా ఇస్తాడు. ‘నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. వరల్డ్ కప్‌లో భారత జట్టు విజయావకాశాల గురించి అస్సలు మాట్లాడవద్దు. ఎందుకంటే ఇలా ఇంత హైప్ క్రియేట్ చేస్తే ఏమవుతుందో తెలుసా? దిష్టి కొడుతుంది..

గత ఏడాది ఏం జరిగిందో చూశారుగా. ఈసారి అలా చేయొచ్చు. మనం ఏమీ చెప్పొద్దు. మొదటి మ్యాచ్ గెలిచామా? ఏమీ మాట్లాడొద్దు. పాకిస్తాన్‌ని ఓడించామా? ఏమీ మాట్లాడవద్దు. ఫైనల్ దాకా వెళ్లినా సరే... ఏమీ చెప్పొద్దు.. మనందరికీ కావాల్సింది వచ్చేదాకా.. ఏమీ మాట్లాడవద్దు..’ అంటూ ధోనీ, న్యూస్ యాంకర్లతో చెబుతున్నట్టుగా కొత్త యాడ్‌ని రూపొందించింది ఓరియో... 

గత ఏడాది టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఆరంభానికి ముందు ఫేస్‌బుక్‌ లైవ్‌లోకి వస్తున్నానంటూ ప్రకటించాడు ధోనీ. అందరూ ఏం చెబుతాడా? ఏ ప్రకటన చేస్తాడా? అని ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే ధోనీ మాత్రం ఓరియో యాడ్ ప్రమోషన్ ఈవెంట్‌ని లైవ్ పెట్టాడు..

‘2011లో ఓరియో బిస్కెట్, మొదటిసారి ఇండియాలో లాంఛ్ అయ్యింది. టీమిండియా, వరల్డ్ కప్ గెలిచింది. ఈసారి ఓరియో రీలాంఛ్ అవుతోంది. ఈసారి కూడా అదే రిపీట్ అవుతుంది..’ అంటూ ‘బిస్కెట్’ సెంటిమెంట్‌తో అభిమానుల చెవుల్లో పువ్వులు పెట్టాడు ధోనీ. ఈ యాడ్‌పై సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోల్ జరిగింది. అందుకే ఈసారి చాలా జాగ్రత్తగా ‘ఏమీ మాట్లాడవద్దు’ అంటూ కొత్త కాన్సెప్ట్‌తో ముందుకొచ్చింది ఓరియో... 
 

Follow Us:
Download App:
  • android
  • ios