Asianet News TeluguAsianet News Telugu

ఎమ్మెస్ ధోనీకి అరుదైన గౌరవం... 15 మంది సభ్యుల డిఫెన్స్ మినిస్టరీ కమిటీలో చోటు...

నేషనల్ క్యాడెట్ క్రాప్స్ (ఎన్‌సీసీ)ని రివ్యూ చేసే 15 మంది డిఫెన్స్ మినిస్టరీ కమిటీలో ఎమ్మెస్ ధోనీకి కూడా చోటు...

MS Dhoni included in the 15 member Defense ministry committee to review National Cadet Corps
Author
India, First Published Sep 17, 2021, 12:25 PM IST

భారత మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీకి అరుదైన గౌరవం దక్కింది. అయితే అది క్రికెట్‌కి సంబంధించినది కాదు. అవును ఎమ్మెస్ ధోనీకి భారత మిలటరీలో గౌరవ లెఫ్టనెంట్‌గా పదవి దక్కిన విషయం తెలిసిందే.

2011లో ఇండియన్ ఆర్మీలో గౌరవ ర్యాంకు పొందిన ఎమ్మెస్ ధోనీ, పారాచూట్ రెజిమెంట్‌లో లెఫ్టినెంట్ కల్నల్‌గా బాధ్యతలు తీసుకున్నారు... క్రికెటర్‌గా కొనసాగుతూనే అప్పుడప్పుడూ ఆర్మీ సేవల్లో పాల్గొంటూ వస్తున్న ఎమ్మెస్ ధోనీకి అరుదైన గౌరవం ఇచ్చింది మిలటరీ.

నేషనల్ క్యాడెట్ క్రాప్స్ (ఎన్‌సీసీ)ని రివ్యూ చేసే 15 మంది డిఫెన్స్ మినిస్టరీ కమిటీలో ఎమ్మెస్ ధోనీకి కూడా చోటు దక్కింది...ప్రస్తుతం ఐపీఎల్ 2021 ఫేజ్ 2లో చెన్నై సూపర్ కింగ్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఎమ్మెస్‌ ధోనీ, నేషనల్ డ్యూటీలో పాల్గొనబోతున్నారు... దీనిపై స్పందించిన సీఎస్‌కే, మాహీకి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేసింది...

ఈ కమిటీ ఎన్‌సీసీ క్యాడెట్స్... దేశాభివృద్ధి, దేశ సంరక్షణ తదితర అంశాల్లో పాలుపంచుకోవడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, ఎన్‌సీసీని మరింత మెరుగ్గా, పటిష్టంగా మార్చేందుకు అవసరమైన మార్పులు, ఇంటర్నేషనల్ యూత్ ఆర్గనైజేషన్స్‌తో కలిసి పనిచేయడం వంటి విషయాలపై సమగ్ర విశ్లేషణ జరిపి, రిపోర్ట్ సమర్పించనుంది...

Follow Us:
Download App:
  • android
  • ios