ఐపీఎల్ 2022 యాడ్ ప్రోమోను విడుదల చేసిన స్టార్ స్పోర్ట్స్ ఛానెల్... ఆటో జానీగా ఊర మాస్ లుక్‌లో కనిపించబోతున్న మాహేంద్ర సింగ్ ధోనీ...

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న మాస్ ఫాలోయింగ్ వేరే లెవెల్. భారత జట్టుకి రెండు వరల్డ్ కప్స్ అందించిన ఎమ్మెస్ ధోనీ, సీఎస్‌కే కెప్టెన్‌గా మరింత ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు... మాహీకి ఉన్న ఫాలోయింగ్ కారణంగానే ఐపీఎల్‌కి ప్రచారకర్తగా ఆయన్నే ఎంచుకుంటోంది స్టార్ స్పోర్ట్స్ ఛానెల్...

ఐపీఎల్ 2020 నుంచి వింత వింత అవతారాల్లో కనిపిస్తూ, ఆర్‌సీబీ, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ వంటి జట్లను ఆటపట్టిస్తున్న మాహీ... ఐపీఎల్ 2022 సీజన్ ప్రచారం కోసం ఆటో జానీగా కనిపించబోతున్నాడు...

ఐపీఎల్ 2022 సీజన్‌కి సంబంధించిన ప్రోమోను సోషల్ మీియాలో వదిలింది స్టార్ స్పోర్ట్స్ ఛానెల్. ఈ యాడ్‌లో ఖాకీ యూనిఫామ్‌లో గుబురు మీసాలతో పూల పూల చేతి రుమాలుతో ఊర మాస్ లుక్‌లో కనిపించబోతున్నాడు మహేంద్ర సింగ్ ధోనీ...

ఐపీఎల్‌ 2022 సీజన్ తర్వాత మహేంద్ర సింగ్ ధోనీ, ఫ్రాంఛైజీ క్రికెట్ నుంచి కూడా తప్పుకుంటాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగానే ఐపీఎల్ 2022 రిటెన్షన్స్‌లో రవీంద్ర జడేజాకి మొదటి రిటెన్షన్‌ ఇచ్చి, ఎమ్మెస్ ధోనీకి రెండో ప్రాధాన్యం ఇచ్చిందని కూడా సమాచారం...

క్రికెట్ నుంచి దూరమైన తర్వాత ఎమ్మెస్ ధోనీ సినిమాల్లోకి రావాలని డిమాండ్ చేస్తున్నారు మాహీ ఫ్యాన్స్. సీఎస్‌కే జట్టుకి నాలుగు ఐపీఎల్ టైటిల్స్ అందించిన మాహీకి అక్కడ ఊర మాస్ ఫాలోయింగ్ ఉంది. తమిళనాడులో అందరూ ధోనీని ‘తలైవా’, ‘తలా’ అని ముద్దుగా పిలుస్తూ ఉంటారు...

Scroll to load tweet…

తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఎమ్మెస్ ధోనీ, సినిమాల్లోకి వస్తే బాక్సాఫీస్‌ను షేక్ ఆడించడం ఖాయమంటూ కామెంట్లు చేస్తున్నారు. ఐపీఎల్ 2022 సీజన్‌లో 10 ఫ్రాంఛైజీలు పాల్గొనబోతున్నారు...

రెండు గ్రూప్‌లుగా విడపోయి, లీగ్‌ మ్యాచులు ఆడబోతున్నాయి ఫ్రాంఛైజీలు. గ్రూప్ ఏలో ముంబై ఇండియన్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ఉన్నాయి. గ్రూప్ బీలో చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగలూరు, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు ఉన్నాయి...

ఐపీఎల్ 2020 సీజన్‌లో వరుస పరాజయాలతో ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న మొదటి జట్టుగా నిలిచి, పాయింట్ల పట్టికలో ఏడో స్థానంతో సరిపెట్టుకుంది చెన్నై సూపర్ కింగ్స్. అయితే 2021 సీజన్‌లో ఊర మాస్ కమ్‌బ్యాక్ ఇచ్చి, నాలుగోసారి టైటిల్ సొంతం చేసుకుంది మాహీ టీమ్... ఐపీఎల్ 2022 సీజన్ కోసం రవీంద్ర జడేజా, ఎమ్మెస్ ధోనీ, మొయిన్ ఆలీ, రుతురాజ్ గైక్వాడ్‌లను రిటైన్ చేసుకున్న సీఎస్‌కే, వేలంలో దీపక్ చాహార్, అంబటి రాయుడు, రాబిన్ ఊతప్ప వంటి ప్లేయర్లను తిరిగి జట్టులోకి తెచ్చుకుంది.