కొందరు క్రికెటర్ల సెలబ్రేషన్ స్టైల్ భిన్నంగా ఉంటాయి. శిఖర్ ధావన్, రవీంద్ర జడేజా వంటి ప్లేయర్లు ఆ కోవకు చెందినవారే. హాఫ్ సెంచరీ చేస్తే, తన బ్యాటుని కత్తిలా తిప్పి సెలబ్రేషన్స్ చేసుకుంటాడు రవీంద్ర జడేజా.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో ఐదు సిక్సర్లు, ఓ బౌండరీతో ఏకంగా 37 పరుగులు రాబట్టిన జడ్డూ...ఈ విధంగానే సెలబ్రేట్ చేసుకున్నాడు. జడేజా బాదుడికి అప్పటిదాకా సీజన్‌లో అద్భుతంగా రాణిస్తూ, పర్పుల్ క్యాప్ రేసులో టాప్‌లో నిలిచిన హర్షల్ పటేల్ గణాంకాలన్నీ మారిపోయాయి.

ఆర్‌సీబీ మ్యాచ్ తర్వాత జడేజా సెలబ్రేషన్స్ స్టైల్‌ను కాపీ చేస్తున్న మహేంద్ర సింగ్ ధోనీ వీడియోను పోస్టు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. ప్రాక్టీస్ టైమ్‌లో ధోనీ, ఇలా చేతులతో కత్తి గాల్లో తిప్పుతుంటూ రాబిన్ ఊతప్ప అతని పక్కనే కూర్చుని చూస్తున్నాడు.

ఈ వీడియోను పోస్టు చేసిన ధోనీ.. ‘ఖడ్గం ఫీట్ తలా’ అంటూ ట్యాగ్ చేసింది. దీనికి జడేజా... ‘బ్యాటుతో ట్రై చేయండి’ అంటూ కామెంట్ చేశాడు.