రాంచీ: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మాత్రమే కాదు, ఆయన భార్య సాక్షి కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. క్రికెట్ కు దూరమైనా కూడా ధోనీ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులను అలరిస్తూనే ఉన్నాడు. 

తాను పెట్టే పోస్టులే కాకుండా తన భార్య సాక్షి పెట్టే పోస్టుల్లోనూ ధోనీ కనిపిస్తూ ఉంటాడు. సాక్షి మాత్రం తన భర్తకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా ఇన్ స్టా గ్రామ్ షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా ధోనీ అభిమానుల కోసం ట్విట్టర్ ఓ వీడియో షేర్ చేశారు. 

ఆ వీడియోలో ధోనీ తన భార్య సాక్షిని ఉద్దేశించి నీ ఇన్ స్టా గ్రామ్ స్టోరీలను అభిమానించే ఫాలోవర్స్ జాబితాలో నన్ను కూడా చేర్చావు కదా అంటూ ట్రోల్ చేశాడు. దాంతో గదిలో ఉన్నవారంతా ఒక్కసారి నవ్వేశారు. వెంటనే సాక్షి ధోనీ వద్దకు వచ్చి "బేబీ! నాకు ఫాలోవర్స్ ఎంత మంది ఉన్నా... నేను ఎప్పటికీ నీదాన్నే" అని అన్నారు.

మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని నిరుడు జూన్ లో జరిగిన ప్రపంచ కప్ టోర్నీలో చివరిసారి ఆడాడు. అప్పటి నుంచి క్రికెట్ కు దూరంగానే ఉంటూ వస్తున్నాడు. బిసీసీఐ వార్షిక కాంట్రాక్ట్ జాబితాలో కూడా ధోనీ పేరు గల్లంతైంది. ఈ స్థితిలో ధోనీ రిటైర్మెంట్ పై తీవ్ర ఉత్కంఠ చోటు చేసుకుంది. అయితే, ధోనీ మాత్రం ఏమీ మాట్లాడడం లేదు.