Asianet News TeluguAsianet News Telugu

ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పిన ఎమ్మెస్ ధోనీ... నవంబర్ నాటికి పూర్తిగా రికవరీ అయితే...

కేవలం అంతర్జాతీయ క్రికెట్ నుంచి మాత్రమే తప్పుకున్నా’... ఐపీఎల్ 2024 సీజన్ ఆడే ఆలోచనలో మహేంద్ర సింగ్ ధోనీ.. 

MS Dhoni going to play in IPL 2024, CSK fans expecting CRA
Author
First Published Oct 27, 2023, 3:49 PM IST

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, తన ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పాడు. ఐపీఎల్ 2020 సీజన్‌కి ముందు అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు ఎమ్మెస్ ధోనీ. అప్పటి నుంచే మాహీ, ఐపీఎల్ నుంచి కూడా తప్పుకుంటాడని ప్రచారం జరుగుతోంది...

ఐపీఎల్ 2023 సీజన్ మాహీకి ఆఖరిదని రకరకాల వార్తలు వచ్చాయి. అయితే 42 ఏళ్ల మాహీ మాత్రం మరో ఏడాది ఆడబోతాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మోకాలి గాయంతో బాధపడుతూనే ఐపీఎల్ 2023 సీజన్ ఆడాడు ధోనీ..

ఐపీఎల్ ముగిసిన తర్వాత మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న ధోనీ, ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్నాడు. ‘మోకాలికి సర్జరీ జరిగింది. ప్రస్తుతం దాని నుంచే కోలుకుంటున్నా.. నవంబర్ కల్లా పూర్తిగా కోలుకుంటానని డాక్టర్ చెప్పాడు. అయితే దినవారీ కార్యకలాపాలకు ఎలాంటి ఇబ్బంది లేదు..’ అంటూ కామెంట్ చేశాడు మహేంద్ర సింగ్ ధోనీ...

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ధోనీ.. ‘మీరు రిటైరైన తర్వాత...’ అని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ‘కేవలం అంతర్జాతీయ క్రికెట్ నుంచి మాత్రమే తప్పుకున్నా’ అని సమాధానం ఇచ్చాడు..

దీంతో ఐపీఎల్ 2024 సీజన్‌లో మాహీ ఆడబోతున్నాడనే ఆశిస్తున్న అభిమానులకు ఇది కచ్ఛితంగా గుడ్ న్యూస్. ఐపీఎల్ 2023 సీజన్‌లో మాహీ కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్, ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌ని ఓడించి ఐదోసారి టైటిల్ గెలిచింది.. 

Follow Us:
Download App:
  • android
  • ios