ధోని పై గంభీర్ ప్రశంసల జల్లు: నెంబర్3 లో బ్యాటింగ్ కి దిగి ఉంటే....
బ్యాటింగ్ లో గనుక ధోని ఫినిషర్ గా కాకుండా నెంబర్ 3 స్థానంలో బ్యాటింగ్ కి దిగితే.... ఎన్నో రికార్డులను కొల్లగొట్టేవాడని అన్నారు టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్.
ధోని గురించిన ఏ విషయమన్న ఒంటికాలుమీద లేచే గౌతమ్ గంభీర్ ధోనీపై ప్రశంసల వర్షం కురిపించాడు. బ్యాటింగ్ లో గనుక ధోని ఫినిషర్ గా కాకుండా నెంబర్ 3 స్థానంలో బ్యాటింగ్ కి దిగితే.... ఎన్నో రికార్డులను కొల్లగొట్టేవాడని అన్నారు టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్.
వన్ డౌన్ లో గనుక ధోని బ్యాటింగ్ కి దిగి ఉంటే... 50 వర్ల ఫార్మాట్లో ఊహించనన్ని రికార్డులతో... పూర్తిగా మరొక విభిన్నమైన ప్లేయర్ గా ధోని అవతరించి ఉండేవాడని గంభీర్ అభిప్రాయపడ్డాడు.
టార్గెట్ ని చేస్ చేయడంలో ధోని, కోహ్లీల మధ్య ఎవరు బెస్ట్ అనే ప్రశ్నకు సమాధానమిస్తూ ఇద్దరిని కంపేర్ చేయడం కష్టమని, కోహ్లీ నంబర్ లో ధోని 6 లేదా 7వ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు కాబట్టి ఇద్దరినీ పోల్చడం సరికాదని అభిప్రాయపడ్డారు గంభీర్.
ప్రస్తుత కాలంలో తయారవుతున్న ఫ్లాట్ పిచ్చులు, బౌలింగ్ ఎటాక్ క్వాలిటీని గనుక తీసుకుంటే... నెంబర్ 3లో గనుక ఈ ఝార్ఖండ్ డైనమైట్ బ్యాటింగ్ కి దిగి ఉంటె... మరో లెవెల్ లో ఉంది ఉండేదని అభిప్రాయపడ్డాడు.
ప్రస్తుతం ఏ దేశ బౌలింగ్ లో కూడా నాణ్యమైన బౌలింగ్ లేదని, ఈ పరిస్థితుల్లో ధోని గనుక కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టకుండా ఫ్రీ బ్యాట్స్ మెన్ గా వన్ డౌన్ లో బాటుంగ్ చేసి ఉంటె... ఎన్ని రికార్డులను బద్దలుకొట్టేవాడో అని గంభీర్ అన్నాడు.
ఇకపోతే.... తాజాగా మహేంద్రసింగ్ ధోని వరల్డ్ క్రికెట్ అతిపెద్ద సూపర్ స్టార్ అని వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో అన్నాడు. ఆన్ ఫీల్డ్, ఆఫ్ ఫీల్డ్‌లో ఎం.ఎస్ ధోనితో మాట్లాడటం అత్యంత సులభమని కరీబియన్ క్రికెటర్ తెలిపాడు.
జింబాబ్వే మాజీ పేసర్ తో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ చాట్‌లో మాట్లాడిన బ్రావో.. అతడు చెన్నై సూపర్‌కింగ్స్ డ్రెస్సింగ్‌రూమ్ అనుభవాలను గురించి అడటంతో ఎం.ఎస్ ధోనిపై ఈ వ్యాఖ్యలు చేశాడు.
చెన్నై సూపర్ కింగ్స్ విజయాలకు కెప్టెన్ ఎం.ఎస్ ధోని, కోచ్ స్టిఫెన్ ఫ్లెమింగ్, ప్రాంఛైజీ యాజమాన్యం ఘనత ఎంతో ఉందని, ప్రాంఛైజీ.... ధోని, ఫ్లెమింగ్‌లను గొప్పగా విశ్వసించిందని బ్రావో అభిప్రాయపడ్డాడు.
అందుకే ఎటువంటి నిర్ణయాలు తీసుకోవటంలోనైనా బయటవ్యక్తుల ప్రమేయం ఉండదని, క్రికెట్‌లో ధోని, ఫ్లెమింగ్ నిత్య విద్యార్థులని, ఆటగాళ్లు ధోనిని ప్రేమిస్తారని బ్రేవో చెన్నై సూపర్ కింగ్స్ టీం విషయాలను చెప్పాడు.
ఆటగాడి సహజశైలి, వ్యక్తిత్వంతో మెలగగలిగే వాతావరణం ప్రాంఛైజీ నెలకొల్పిందని, క్రికెట్‌లో, తమ జట్టులో ఎం.ఎస్ ధోని అతిపెద్ద సూపర్‌స్టార్ అని, సులభంగా మాట్లాడేందుకు చనువు ఇచ్చే వ్యక్తుల్లో ధోని ఒకరని బ్రావో తెలిపాడు.